Mother Killed Children: తెలంగాణలో ఘోరం.. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి సూసైడ్ - 2నెలల పసికందు కూడా
సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని చంపి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు.