Telangana Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..ఎన్నికలు ఎపుడంటే?

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నగారా మోగింది. సింగిల్ ఫేజ్‌లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. తక్షణం రాష్ట్రవ్యాప్తంగా (జీహెచ్ఎంసీ పరిధి మినహా) ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.

New Update
Karimnagar Municipal Corporation

Karimnagar Municipal Corporation

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు(muncipal corporation) ఎన్నికల నగారా మోగింది. సింగిల్ ఫేజ్‌లోనే ఎన్నికలు నిర్వహించేలా స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూలు రిలీజ్ చేసింది. తక్షణం రాష్ట్రవ్యాప్తంగా (జీహెచ్ఎంసీ పరిధి మినహా) ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్నది. 13 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. శివరాత్రి పండుగ, రంజాన్ ఉపవాసాల ప్రారంభం.. తదితరాలను దృష్టిలో పెట్టుకుని విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం జనవరి 28న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ, చీఫ్ సెక్రటరీ తదితరులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూలును ఖరారు చేశారు.

Also Read :  Wings India-2026 : హాట్టహాసంగా వింగ్స్ ఇండియా 2026.. కనువిందు చేయనున్న విమానాల విన్యాసాలు

Telangana Municipal Elections 2026

మొత్తం ఓటర్ల సంఖ్య 52 లక్షల 43 వేలు
Municipal Elections ఎలక్షన్ షెడ్యూలు ఇలా :
116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు
నోటిఫికేషన్ విడుదల : జనవరి 28
నామినేషన్లు స్టార్ట్: జనవరి 28
నోటిఫికేషన్ : జనవరి 28
చివరి గడువు : జనవరి 30
స్క్రూటినీ : జనవరి 31
ఉపసంహరణ : ఫిబ్రవరి 03
పోలింగ్ : ఫిబ్రవరి 11
కౌంటింగ్ : ఫిబ్రవరి 13

Also Read :  వరంగల్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న డాక్టర్‌ మృతి

పోలింగ్ కేంద్రాలు : 8,195

పోలింగ్ టైమ్ : ఉదయం 7.00 గం. నుంచి సాయంత్రం 5.00 గం. వరకు

Advertisment
తాజా కథనాలు