Wings India-2026 : హాట్టహాసంగా వింగ్స్ ఇండియా 2026..కనువిందు చేయనున్న విమానాల విన్యాసాలు

హైదరాబాద్ బేగంపేట ఎయిర్ ఫోర్ట్‌ అంతర్జాతీయ ప్రదర్శనకు సిద్ధమైంది. వింగ్స్‌ ఇండియా 2026 పేరుతో నిర్వహించనున్న అతిపెద్ద పౌరవిమానయాన ప్రదర్శనకు బేగంపేట వేదికైంది. జనవరి 28 నుండి 31 వరకు జరిగే వేడుకల కోసం వివిధ దేశాలకు చెందిన విమానాలు బేగంపేటకు చేరుకున్నాయి.

New Update
FotoJet (18)

Wings India 2026

wings-india-2026 : హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ ఫోర్ట్‌(Begumpet Airport News) అంతర్జాతీయ ప్రదర్శనకు సిద్ధమైంది. వింగ్స్‌ ఇండియా 2026 పేరుతో నిర్వహించనున్న అతిపెద్ద పౌరవిమానయాన ప్రదర్శనకు బేగంపేట వేదికైంది.  జనవరి 28 నుండి 31 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. దీనికోసం వివిధ దేశాలకు చెందిన పలు అంతర్జాతీయ విమానాలు బేగంపేట విమానశ్రయానికి చేరుకున్నాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

FotoJet (20)

Also Read :  నేటి నుంచే రాష్ట్రంలో అమలులోకి ఎన్నికల కోడ్.. పుర'పోరుకు షెడ్యులు ప్రకటన!

FotoJet (21)

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమం ద్వారా ప్రపంచ విమానయాన పర్యావరణ వ్యవస్థలోని కీలక భాగస్వాములను ఒకచోట చేర్చి, అంతర్జాతీయ పౌర విమానయానంలో భారతదేశం పాత్రను తెలియజేస్తుందని భావిస్తున్నారు. వింగ్స్ ఇండియా 2026లో ఇంటర్నేషనల్‌  ఎగ్జిబిషన్ , స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ డిస్‌ప్లేలు, ఏరోబాటిక్ ఫ్లయింగ్ షోలు, గ్లోబల్ ఏవియేషన్ కాన్ఫరెన్స్, మినిస్టీరియల్ ప్లీనరీ సెషన్‌లు , గ్లోబల్ CEOల ఫోరమ్ తదితర అంశాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో CEO రౌండ్‌టేబుల్స్, B2B , B2G మీటింగ్స్, ఏవియేషన్ జాబ్ ఫెయిర్, స్డూడెంట్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ మరియు అవార్డుల ప్రదానోత్సవం కూడా నిర్వహించనున్నారు.

FotoJet (25)

Also Read :  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం.. మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు

FotoJet (26)

ఇండియన్‌ ఏవియేషన్‌: పేవింగ్‌ ద ఫ్యూచర్‌

గడచిన దశాబ్దంలో, భారతదేశ పౌర విమానయాన రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది. గతంతో పోలిస్తే ప్రయాణీకుల రద్దీ అనేక రెట్లు పెరిగింది, ఇండియాను ప్రపంచంలోని ప్రముఖ విమానయాన మార్కెట్లలో ఒకటిగా నిలిపింది. ఈ క్రమంలో మనదేశం ఎన్నో కొత్త విమానాలను కొనుగోలు చేసింది, రికార్డు స్థాయిలో విమాన ఆర్డర్‌లతో దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భవిష్యత్ విమాన మార్కెట్లలో ఒకటిగా నిలిపాయి. ఈ క్రమంలో ‘ఇండియన్‌ ఏవియేషన్‌: పేవింగ్‌ ద ఫ్యూచర్‌’ అనే ప్రధాన ఇతివృత్తంతో ‘వింగ్స్‌ ఇండియా 2026’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రదర్శనలో విమానాల తయారీ, డిజైన్‌, నిర్వహణ, భద్రత వంటి కీలక అంశాలు ఉంటాయి. యువత కోసం ఏవియేషన్ జామ్ మేళా, స్టూడెంట్స్ కోసం ‘సివిల్‌ ఏవియేషన్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌’ను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

WhatsApp-Image-2026-01-27-at-13.16.12-2-1024x683

20 దేశాల నుంచి ప్రతినిధులు

కాగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న వింగ్స్‌ ఇండియా 2026 కార్యక్రమంలో కంబోడియా, ఘనా, రష్యా, సీషెల్స్, ట్రినిడాడ్ , టొబాగో, సింగపూర్, అల్జీరియా, డొమినికన్ రిపబ్లిక్, ఇరాన్, మాల్దీవులు, మంగోలియా, మొజాంబిక్, ఒమన్, ఖతార్, యూరోపియన్ యూనియన్, యుకె, ఫ్రాన్స్, జర్మనీ మరియు యుఎస్ఎలతో సహా 20 దేశాల నుండి మినిస్టర్ లెవల్, అధికారిక ప్రతినిధులు పాల్గొంటారు. దీనితో పాటు ఇండియాలో వివిధ రాష్ట్రాల నుండి విమానయాన రంగానికి చెందిన అధికారులు, ప్రతినిధులు  కూడా పాల్గొంటారు.

WhatsApp-Image-2026-01-27-at-13.16.13-1-1024x683

ఆకట్టుకోనున్న విమాన ప్రదర్శనలు

వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమంలో 150 మందికి పైగా ప్రదర్శనకారులు, దాదాపు 7,500 మంది బిజినెస్ విజిటర్స్ , లక్ష మంది సాధారణ సందర్శకులు, 200 మందికి పైగా విదేశీ ప్రతినిధులు , 500 కి పైగా B2B , B2G (బిజినెస్ టు గవర్నమెంట్ ) సమావేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పలు రకాల విమాన ప్రదర్శనలు 31వరకు విమానాలు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. భారతదేశ అభివృద్ధి చెందుతున్న విమానయాన దృశ్యాన్ని ప్రదర్శిస్తూనే ప్రపంచ పౌర విమానయాన భవిష్యత్తు దిశను చర్చించడానికి వింగ్స్ ఇండియా 2026 ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని విమానయాన నిపుణులు భావిస్తున్నారు.

WhatsApp-Image-2026-01-27-at-13.16.10-1-1024x494

Advertisment
తాజా కథనాలు