BIG BREAKING: తెలంగాణలో మరో సంచలన స్కామ్.. బయటపెట్టిన హరీష్ రావు!

తెలంగాణలోని ఎక్సైజ్‌ శాఖలో మరో భారీ స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మైక్రో బ్రేవరీస్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు. దీనికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు.

New Update
Harish Rao

Harish Rao

తెలంగాణలోని ఎక్సైజ్‌ శాఖలో మరో భారీ స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మైక్రో బ్రేవరీస్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు. దీనికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు. ''మైక్రో బ్రేవరీస్ కోసం మొత్తం 110 అప్లికేషన్స్ వచ్చాయి. 25 అప్లికేషన్స్‌కు ఒకే చేద్దామని అనుకున్నారు. మంత్రి కోటాలో 4, ముఖ్యనేత కోటాలో 21 ఇద్దామనుకున్నారు. ముఖ్యనేతకు తోడై, నీడై ఆ నాయకుడు ఇంట్లోనే ఉంటాడు . ఈ మధ్య వార్తల్లో కూడా ఉన్నారు. నేరుగా ఆయన కారు ముఖ్యనేత ఇంట్లోకి వెళ్తుంది. ఈ మధ్య ఆ ముఖ్య నేత తిరుపతి వెళ్తే కూడా నీడలాగే వెంటే ఉన్నాడు. ఈ మధ్య వార్తల్లో ఉన్న ఆ వ్యక్తి ఒక్కొక్క బ్రివరికి రూ.కోటి 80 లక్షల ధర నిర్ణయించారు. ఒకటిన్నర కోటి ముఖ్యనేతకు, 30 లక్షలు తోడు నీడకు అనధికారికంగా ముడుతుంది.

ఎక్కువ అప్లికేషన్స్ వస్తే వైన్స్ టెండర్‌ లాగానే డ్రా తీయాలి కదా. కానీ ఎందుకు ఈ అక్రమాలు చేస్తున్నారు ?. బ్రేవరీస్‌కి ప్రభుత్వం నుంచి రూ.6500 కోట్ల బకాయిలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు బ్రీజర్స్ కొరత ఉంది. వాటాల పంపకాల వల్ల ఈ బిల్లులు చెల్లించడం లేదు. మల్టీ నేషనల్ కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వానికి లేఖలు రాశాయి. దీంతో రాష్ట్ర ఆదాయం పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే హలో గ్రామ్ టెండర్ ముఖ్యనేత తమ్ముడికి కావాలని, మంత్రి కొడుకుకి కావాలని గొడవ జరిగింది. ఈ ప్రభుత్వం బీరు కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదు. 

Also Read: మానవజన్మఎత్తి వీరవనితలుగా నిలిచిన అడవిచుక్కలు "సమ్మక్క..సారక్క'

రైతులకంటే బీరు కంపెనీలే మాకు ముఖ్యం అంటున్నారు. మెదక్ జిల్లాలో 45 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. కానీ సంగారెడ్డిలో సింగూరు నీళ్లను బీరు కంపెనీలకు అందిస్తున్నారు. ఇది మద్యం కంపెనీలకు కొమ్ము కాసే ప్రభుత్వం. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి సంగారెడ్డి వెళ్లి రైతులకు నీళ్లు ఇవ్వొద్దు..బీరు కంపెనీలకు మాత్రం నీళ్లను ఇవ్వండి అని అధికారిక ఆదేశాలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గౌడన్నలను వందల సంఖ్యలో కేసులు పెట్టి జైలు పాలు చేసింది.

Also Read: తండ్రి లాంటి శరద్ పవర్‌పై అజిత్ తిరుగుబాటు.. కారణమేంటో తెలుసా?

 ప్రాణాలు కోల్పోయిన లేదా శాశ్వత వికలాంగులుగా మారిన గౌడన్నలకు బీఆర్‌ఎస్ రూ.5 లక్షల పరిహారం ఇస్తే ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద బహిరంగ మీటింగ్ లో గౌడన్నలను బకాయిలు చెల్లిస్తామని రేవంత్ అన్నాడు.16 నెలలైనా ఒక్క రూపాయి ఇవ్వలేదు. గౌడన్నలు అంటే రేవంత్ రెడ్డికి చులకన. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిందని'' హరీశ్‌ రావు అన్నారు. 

Advertisment
తాజా కథనాలు