SIT Officials: కేసీఆర్‌కు బిగ్ షాక్.. నోటీసులు ఇవ్వనున్న సిట్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

New Update
KCR

KCR

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping) లో కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(kcr) కు నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే సిట్ అధికారులు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి అక్కడే నోటీసులు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే కేసీఆర్‌ను విచారణకు హాజరు కావాలని తెలపనున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను సిట్ అధికారులు విచారించారు. ఇప్పుడు కేసీఆర్‌ను విచారించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన పలువురు పోలీసు అధికారులను అరెస్టు చేసి ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు.

ఇది కూడా చూడండి: Ajith Pawar Plane Crash: అజిత్ పవార్ ప్రయాణించిన విమానం 'లీర్జెట్ 45' వివరాలు.. గతంలో కూడా ఇదే విమానానికి ఘోర ప్రమాదం!

SIT Officials Will Be Issuing Notices To KCR

Advertisment
తాజా కథనాలు