/rtv/media/media_files/2026/01/27/fotojet-30-2026-01-27-19-29-14.jpg)
Election Code comes into effect in Telangana
తెలంగాణలో మున్సిపల్ ఎన్నిక(Telangana Municipal Elections 2026) లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. కాగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల(muncipal corporation) లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. ఈ మేరకు 28వ తేది నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా ఫిబ్రవరి 11న పోలింగ్ జరగుతుందని.. అలాగే ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని అన్నారు. మరోవైపు నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్(election-code) అమల్లోకి వచ్చింది. నగదు రవాణాపై కఠిన నియమాలను అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. నేటి నుంచి ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో పోలీసులు నిఘా మరింత పెంచనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 52.43 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Also Read : గట్టమ్మ ఆలయం.. గేట్ వే ఆఫ్ మేడారం ఎందుకో తెలుసా?
Election Code Comes Into Effect In Telangana
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అలాగే ఈ నెల 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. రీ పోలింగ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఫిబ్రవరి 12 న నిర్వహిస్తారు. ఇక ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుంది. అదేరోజు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరగనుంది.
కాగా, ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారని వారంతా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఏడీజీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు నగదు రవాణాపై పోలీసులు కఠిన నిబంధనలు విధించారు.. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వ్యక్తులు గరిష్టంగా రూ. 50,000 వరకు మాత్రమే నగదును వెంట తీసుకెళ్లాలి. రూ. 50,000 కంటే ఎక్కువ నగదు ఉంటే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపించాలని తేల్చి చెప్పారు. లేని పక్షంలో ఆ నగదును సీజ్ చేస్తారు. అయితే పోలీసులు నగదు లేదా ఇతర వస్తువులను సీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా రిసీప్ట్ ఇస్తారు. దానిపైనే అప్పీల్ చేసుకునే వివరాలు కూడా ఉంటాయి.
Also Read : రహస్య భేటీ కాదు.. రాష్ట్ర అభివృద్ధిపైనే చర్చ.. భట్టి విక్రమార్క కీలకవ్యాఖ్యలు
Follow Us