Telangana State Politics : రహస్య భేటీ కాదు..రాష్ట్ర అభివృద్ధిపైనే చర్చ..భట్టి విక్రమార్క కీలకవ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సోమవారం జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో ఆయనతో ముగ్గురు మంత్రులు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ భేటీ తీవ్ర చర్చనీయాంశమైంది.

New Update
FotoJet (29)

Secret meeting of four ministers

Telangana State Politics : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సోమవారం జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లోక్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం ముగిశాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(batti-vikramarka) నివాసంలో ఆయనతో  ముగ్గురు మంత్రులు భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రులు శ్రీధర్ బాబు(duddilla-sridhar-babu), అడ్లూరి లక్ష్మణ్ కుమార్(adluri laxman), ఉత్తమ్ కుమార్ రెడ్డి(uttamkumarreddy) ఒకే కారులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ మంత్రుల రహస్య భేటీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేసేందుకే వారు సమావేశమయ్యారని ప్రచారం సాగింది. అయితే దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.

-- మంత్రుల సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిపై మాత్రమే చర్చించామని భట్టి స్పష్టం చేశారు.-- మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై చర్చించామన్న ఆయన ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.-- మంత్రులు సీఎం లేకుండా ఉప ముఖ్యమంత్రితో మాట్లాడరా? అంటూ ప్రశ్నించిన భట్టి-- జిల్లాల మంత్రులు, నేతలు మాట్లాడటం సాధారణం అంటూ తేల్చి చెప్పారు. అలాగే జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సమస్యపై కరీంనగర్‌ జిల్లా నేతలతో మాట్లాడినట్లు వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రి లేని సమయంలో నలుగురు మంత్రులు ప్రత్యేకంగా సమావేశమవడం -- తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

Also Read :  మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ఎన్నికలు ఎపుడంటే?

రాజకీయాలు ఆపాదించకండి..శ్రీధర్‌ బాబు క్లారిటీ

ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతి చర్చకు రాజకీయాలను ఆపాదించడం సరికాదని  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం నలుగురు మంత్రుల సమావేశంపై స్పందించిన ఆయన తమ సమావేశాన్ని  "రహస్య భేటీ" అంటూ విష ప్రచారం చేయడం తగదని దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంత్రుల భేటీ పై సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కొందరు కావాలనే పనిగట్టుకుని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీధర్‌ బాబు మండిపడ్డారు. "ప్రజాస్వామ్యంలో క్యాబినెట్ అనేది ఒక యూనిట్. పాలనాపరమైన అంశాల్లో ఎక్కడ జాప్యం ఏర్పడకుండా ఉండటానికి సీనియర్ మంత్రులు(CONGRESS MINISTERS)గా మేం చర్చించుకుంటే అందులో తప్పేముంది..? అది ప్రభుత్వ సమష్టి బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసంలో మేము భేటీ అయ్యి పాలనాపరమైన అంశాలను మాత్రమే చర్చించామని స్పష్టం చేశారు. లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి ముందే మేమంతా ఒకే కారులో వెళ్లాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సన్నద్ధత అనేది రాజకీయ పార్టీల ప్రాథమిక బాధ్యత. దీనికి కూడా లేనిపోని రంగులు పూయడం సమంజసం కాదు" అని శ్రీధర్‌ బాబు అన్నారు. "నిర్మాణాత్మకమైన విమర్శలను మేము ఎప్పుడూ స్వాగతిస్తాం. కానీ వ్యక్తిత్వ హననానికి, ఊహాజనిత కథనాలకు పాల్పడితే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. రాష్ట్రాభివృద్ధి కోసం భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న మా ప్రభుత్వం పై అసత్య ప్రచారం చేయడం ఇకనైనా మానుకొని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి" అని మంత్రి కోరారు. - telangana-praja-bhavan

Also Read :  సంతోష్ రావు రేవంత్ రెడ్డి సీక్రెట్ ఏజెంట్.. SIT విచారణ వేళ కవిత సంచలన ఆరోపణలు!

Advertisment
తాజా కథనాలు