హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు షాక్.. బండి సంజయ్ విజయం
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో ఊరట దక్కింది. దీనిపై తాజాగా విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. ఇది పూర్తి నిరాధారమైన కేసుగా తోసిపుచ్చింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో ఊరట దక్కింది. దీనిపై తాజాగా విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. ఇది పూర్తి నిరాధారమైన కేసుగా తోసిపుచ్చింది.
సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం అతడిని నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తనకు మంత్రి పదవి ఇస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానిని దానం నాగేందర్ ఏఐసీసీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం.
పార్టీ ఫిరాయింపుల కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఆ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి ఆ పార్టీ ఫిటిషన్ వేసింది.
వరుసగా అవకతవకల విషయంలో ఆరోపణలు వస్తున్న వేళ వేములవాడ ఆలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.పాలనా పరమైన వ్యవహారాలకు సంబంధించి వేములవాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న పలువురిని బదిలీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయంశంగా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన గోవింద్ అభినవ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి రెండవ బైపాస్ రహదారిలోని మురికి కాల్వలో పడి మృతి చెందినట్లుగా సమాచారం. బైక్‌తో పాటు పడిపోవడంతో యువకుడు మృతి చెందాడు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఫార్ములా -కారు రేసు కేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు.
ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో భార్యాభర్తల మధ్య తలెత్తిన ఘర్షణతో భార్య హత్య చేశాడు. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న భార్య గోగుల సాయివాణిని ఆమె భర్త భాస్కర్ గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాచారం 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ను వెనుక నుండి జగన్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.