/rtv/media/media_files/2025/11/20/danam-nagendar-likely-to-resign-from-mla-post-2025-11-20-14-33-52.jpg)
Danam nagendar likely to resign from MLA post
తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender)కు స్పీకర్(speaker) మరోసారి నోటీసులు అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా దానం నాగేందర్ ఢిల్లీకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు ఆయన ఢిల్లీ వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ స్పీకర్ ముందు హాజరైతే అనర్హత వేటు పడుతుందని దానం భావిస్తున్నారు.
Also Read: ఆరోగ్యం కోసం ఒకసారైనా చేయించుకోవాల్సిన 9 రక్తపరీక్షలు ఇవే!
Danam Nagendar Resign MLA Post
తనకు మంత్రి పదవి ఇస్తేనే రాజీనామా చేస్తానని కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానం నాగేందర్ విచారణకు హాజరుకావాలని ఈరోజు స్పీకర్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకు దానం నాగేందర్ రాజీనామాపై ఓ స్పష్టత రానుంది. అయితే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే బాటలో కడియం శ్రీహరి కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: చెప్పి మరీ దెబ్బ కొట్టాం..ఢిల్లీ పేలుళ్ళపై పాకిస్తాన్ నేత షాకింగ్ కామెంట్స్
Follow Us