/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t104645024-2025-11-20-10-47-15.jpg)
Suspicious death of a young man in Vemulawada
Crime: రాజన్న సిరిసిల్ల జిల్లా(rajanna sircilla) వేములవాడ(vemulawada) పట్టణానికి చెందిన గోవింద్ అభినవ్(25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి రెండవ బైపాస్ రహదారిలోని మురికి కాల్వలో పడి మృతి చెందినట్లుగా సమాచారం. బైక్‌తో పాటు పడిపోవడంతో యువకుడు మృతి చెందినట్లు తెలుస్తోంది.
Also Read: కథ చెబుతానని పిలిచి ఆ డైరెక్టర్ బలవంతం చేసాడు: మౌనీ రాయ్
మృతుడు బద్ది పోచమ్మ ఆలయంలో దినసరి కార్మికుడిగా కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఇటీవలే రాజన్న ఆలయంలో ఆలయ గోదాం నుండి సరుకులను సదరు విభాగం పర్యవేక్షకుడి వాహనంలోకి తరలించింది మృతుడే కావడం గమనార్హం. గోదాం సరుకుల తరలింపు వ్యవహారం ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతుండగా తరలించిన వ్యక్తి ఆకస్మిక మృతి చెందటంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో వేములవాడ సూపరిండెంట్ వెంకటప్రసాద్ రాజు కారులో ఆలయ సామాగ్రిని ఉంచుతున్న వ్యక్తి నేడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఢిల్లీ బాస్ట్ కేసులో కొత్త మలుపు.. ఉమర్ తో సంబంధం ఉన్న మరో ఇద్దరి అరెస్ట్
Follow Us