/rtv/media/media_files/2025/11/20/ibomma-ravi-2025-11-20-15-10-58.jpg)
Ibomma Ravi
సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ, బప్పం టీవీ(bappam tv) నిర్వాహకుడు ఇమ్మడి రవి(iBomma Ravi)ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం అతడిని నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా బషీర్‌బాగ్‌లోని సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు అతడిని తరలించారు. పైరసీ వెబ్‌సైట్లకు సంబంధించి అన్ని కోణాల్లో అధికారులు రవిని ప్రశ్నిస్తున్నారు. నాంపల్లి కోర్టు మొత్తం అయిదురోజుల పాటు రవిని విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది.
Also Read: ఢిల్లీకి దానం.. ఆ హామీ ఇస్తే ఏ క్షణమైనా MLA పదవికి రాజీనామా!
IBomma Ravi Into Custody
ఇదిలాఉండగా ఇమ్మడి రవి దాదాపు 21 వేల సినిమాలను పైరసీ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. గత ఆరేళ్లుగా అతడు కరేబియన్ దీవుల్లో ఉంటూ 66 మిర్రర్ వెబ్‌సైట్లలో పైరసీ సినిమాలు అప్‌లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు దాదాపు 50 లక్షల మంది డేటా సేకరించి సైబర్ నేరగాళ్లు, గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులకు అమ్మేసి వందల కోట్లలో డబ్బులు సంపాదించినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడిపై కస్టడీ కొనసాగుతోంది. ఇది పూర్తయిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం బయటికి రానుంది.
Follow Us