KTRకు బిగ్ షాక్: ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఫార్ములా -కారు రేసు కేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు.

New Update
KTR

KTR

KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఫార్ములా -కారు రేసు(E Formula Race) కేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఈ కేసులోనిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతితో ఏసీబీ త్వరలోనే కేటీఆర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేయనుందని సమాచారం. కాగా ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1 గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను  ఏ-2గా ఏసీబీ పేర్కొంది. 

Also Read: ఢిల్లీ బాస్ట్ కేసులో కొత్త మలుపు.. ఉమర్ తో సంబంధం ఉన్న మరో ఇద్దరి అరెస్ట్

ఏసీబీ విచారణకు నాలుగు సార్లు

ఇప్పటికే కేటీఆర్ ఈ కేసు విషయంలో ఏసీబీ విచారణకు నాలుగు సార్లు హాజరయ్యారు. ఈ కేసులో ఏసీబీ కేటీఆర్ పాత్రకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈ-మెయిల్స్ ను, ఎలెక్ట్రానిక్ సాక్ష్యాలను, ఇతర సాక్ష్యాలను కూడా సేకరించింది. తొమ్మిది నెలల పాటు పకడ్బందీగా అన్ని కోణాల నుండి ఏసీబీ కూడా విచారణ జరిపింది. కేటిఆర్ ను ప్రాసిక్యూట్ చేసేటందుకు సెప్టెంబర్ 9 న గవర్నర్ కు ఏసీబీ  అనుమతి కోరుతూ లేఖ రాసింది. దాదాపుగా 10 వారాల తర్వాత గవర్నర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.  

Also Read: ఖమ్మం గట్టయ్య సెంటర్‌లో దారుణం.. ఉదయాన్నే భార్య గొంతు కోసి.. పిల్లలను నరికి..!

ఈ కేసులో ఏ-2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికే కేంద్రంలోని డీఓపీటీకు కూడా లేఖ రాశారు. గవర్నర్ అనుమతి నేపథ్యంలో, చార్జ్‌షీట్ దాఖలుకు ముందు ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్‌ను లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది.ఈ కేసుపై గవర్నర్ అనుమతి లభించడంతో, రాజకీయ వర్గాలలో,  పరిపాలనా వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ త్వరలో దాఖలు చేయబోయే చార్జ్‌షీట్‌తో ఈ కేసు విచారణ కీలక మలుపు తిరగనుంది.

Advertisment
తాజా కథనాలు