/rtv/media/media_files/2025/11/20/khammam-crime-news-2025-11-20-10-28-37.jpg)
Khammam Crime News
ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్ సమీపంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు భార్య హత్యకు దారి తీసింది. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న భార్య గోగుల సాయివాణి (36)ని ఆమె భర్త భాస్కర్ ఉదయం దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనతో ఖమ్మం నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
భార్యను గొంతు కోసి ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోగుల సాయివాణి, భాస్కర్ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారు మూడు నెలల క్రితం గట్టయ్య సెంటర్‌కు సమీపంలో అద్దెకు దిగారు. అయితే భార్యాభర్తల మధ్య గత సంవత్సర కాలంగా తరచూ గొడవలు జరుగుతుండేవని సమాచారం. ఈ కారణంతోనే గత కొన్ని నెలలుగా సాయివాణి భర్త నుంచి విడిగా ఉంటోంది. ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో నిందితుడు భాస్కర్ మద్యం సేవించి కత్తి తీసుకుని సాయివాణి ఉంటున్న ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన భాస్కర్ ఆమెను కత్తితో గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
ఇది కూడా చదవండి: దారుణం.. 65ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం ఆపై హత్య
భర్త భాస్కర్ తల్లిని హత్య చేస్తుండగా అడ్డుకోబోయిన కూతురు హర్షవర్ధనిపై కూడా అతడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కూతురిని స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సాయివాణిని హత్య చేసిన తరువాత నిందితుడిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. భార్యను హత్య చేసిన భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు వ్యక్తిగత గొడవలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: హత్య చేసి పరార్.. 8 ఏళ్లకు ల్యాప్‌టాప్‌తో దొరికిపోయాడు!
Follow Us