/rtv/media/media_files/2025/07/06/raja-rajeshwara-temple-vemulawada-2025-07-06-11-36-40.jpg)
Shock for Vemulawada temple employees.. Massive transfers
Vemulawada temple : వరుసగా అవకతవకల విషయంలో ఆరోపణలు వస్తున్న వేళ వేములవాడ ఆలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.పాలనా పరమైన వ్యవహారాలకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ దేవాలయం వేములవాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న పలువురిని బదిలీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయంశంగా మారింది. ఈ మేరకు ఆలయ పరిధిలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న మొత్తం 17 మంది ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన వారిలో ఇద్దరు ఏఈవోలు,ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లు, నలుగురు సూపరింటెండెంట్లు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒకరు రికార్డ్ అసిస్టెంట్, ఒకరు అటెండర్ ఉన్నారు. అయితే, ప్రసాదం గోదాంలో సరుకులు మాయం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటప్రసాద్ రాజును అంతర్గత బదిలీతోనే సరిపెట్టడంతో విషయం హాట్ టాపిక్‌గా మారింది. కాగా గోదాంలో సరుకులు వెంకటప్రసాద్ రాజు కారులో పెట్టిన ఉద్యోగి అర్థరాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందటం కలకలం రేపింది.
/filters:format(webp)/rtv/media/media_files/2025/11/20/508249-g6k005nacaqjfja-2025-11-20-11-50-21.webp)
/filters:format(webp)/rtv/media/media_files/2025/11/20/508250-g6k005pacaavh63-2025-11-20-11-50-56.webp)
Follow Us