BIG BREAKING: బెంగళూరు హైవేపై మరో ప్రమాదం.. యాసిడ్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన బస్సు

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల  మాచారం 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ను వెనుక నుండి జగన్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

New Update
FotoJet - 2025-11-20T084314.643

Another accident on Bangalore highway.. Bus hits acid tanker

BIG BREAKING: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల  మాచారం 44వ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.వంతెన పై వెళుతున్న మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ను వెనుక నుండి జగన్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ట్యాంకర్ లోని కెమికల్ మంటలు అంటుకునే అవకాశం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ట్యాంకర్ నుంచి పొగలు వెలువడినప్పటికీ సకాలంలో మంటలను అదుపు చేయడంతో  పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.చిత్తూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా జడ్చర్ల మండలం మాచారం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.. బస్సులోని  ప్రయాణికులను ప్రమాదం నుంచి తప్పించి మరొక బస్సులో ప్రయాణికులను పంపారు. ప్రమాదంతో  జాతీయ రహదారిపై  ట్రాఫిక్ స్తంభించింది.

జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో బయలు దేరింది జగన్ ట్రావెల్ బస్సు. ఈ క్రమంలోనే జడ్చర్ల పట్టణానికి చేరుకోగానే మాచారం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ముందుగా వెళుతున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ను వెనక నుండి జగన్ ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొంది. దీంతో ట్యాంకర్ కెమికల్ లీకై రోడ్ మీద పడడంతో పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్‌ బస్సులో ప్రయాణికులను అప్రమత్తం చేయగా అందరూ  అప్రమత్తమై కిందికి దిగారు. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా దిగడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కెమికల్ లీకేజీ ద్వారా వస్తున్న పొగలను అదుపులోకి తెచ్చారు. 

విషయం తెలిసిన పట్టణ సీఐ కమలాకర్ స్పందించి ఘటనా స్థలానికి చేరుకొన్నారు. బస్సు ప్రమాద బాధితులను మరో వాహనంలో హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనతో 44వ జాతీయ రహదారి పై ఇరువైపులా సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  ఇటీవల వరుస జరుగుతున్న బస్సు ప్రమాదాలతో హడలెత్తిన ప్రజలు మరోసారి జడ్చర్లలో బస్సు ప్రమాదం జరగడంతో ఆందోళనకు గురయ్యారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు