MLA Defection Case: వారిద్దరూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే.. స్పీకర్‌ నోటీసులు

పార్టీ ఫిరాయింపుల కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ పై ఆ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల మీద స్పీకర్‌ చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి ఆ పార్టీ ఫిటిషన్‌ వేసింది.

New Update
FotoJet - 2025-11-20T133414.582

MLA Defection Case

MLA Defection Case:  పార్టీ ఫిరాయింపుల కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ పై బీఆర్‌ఎస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఇచ్చిన సమయంలోగా సంబంధిత ఎమ్మెల్యేల మీద స్పీకర్‌ చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంలో మరోసారి ఆ పార్టీ ఫిటిషన్‌ వేసింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు స్పీకర్ మీద సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో స్పీకర్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. 

ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు అఫిడవిట్‌లు దాఖలు చేయలేదని తెలుస్తోంది.  ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి.. స్పీకర్ నోటీసులకు ఇంతవరకు స్పందించలేదు. దీంతో వారికి స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. మిగిలిన వారిలాగే అనర్హత పిటిషన్లపై అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందేనని అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేల విచారణ ఈ రోజుతో (గురువారం)తో ముగియనుంది. కేసు విచారణ ఆలస్యంపై సుప్రీం సీరియస్ అవడంతో పాటు నాలుగు వారాలు గడువు మాత్రమే ఇచ్చింది. ఈ క్రమంలో విచారణలో వేగం పెంచాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండో విడత విచారణలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలను ఈ రోజు విచారణకు పిలిచారు. ఉదయం ఎమ్మెల్యేల విచారణ సాగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి కేసును స్పీకర్ విచారించారు. ఇరు వర్గాల ఆర్గ్యుమెంట్స్‌ను స్పీకర్ విన్నారు. అలాగే మధ్యాహ్నం అరికెపూడి గాంధీ వర్సెస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసు విచారించారు. మిగిలిన వారి విచారణ ఇంకా కొనసాగే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు