భార్య, పిల్లల్ని చంపిన హత్య కేసు.. దోషికి ఉరిశిక్ష

వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో నిందితుడిని దోషిగా తేల్చింది. దీంతో అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

New Update
vikarabad murder case

vikarabad murder case

వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో నిందితుడిని దోషిగా తేల్చింది. దీంతో అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2019లో వికారాబాద్ జిల్లాలో ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడు. ఆ తర్వాత వాళ్లు ఆత్మహత్య చేసుకుని చనిపోయారంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే తాజాగా ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో జిల్లా కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. 

Advertisment
తాజా కథనాలు