Latest News In Telugu Telangana: బజాజ్ షోరూంలో పేటీఎంతో రూ.4 లక్షల మోసం.. ఎస్సార్‌నగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు వచ్చారు. రూ.4 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఏసీలు కొన్నారు. పేటీఎం నుంచి ఇతర వ్యక్తి ద్వారా డబ్బులు చెల్లించి మళ్లీ అతడి ఖాతాలోకే డబ్బులు మళ్లించేలా చేశారు. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు తీవ్ర అస్వస్థత మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక విమానంలో ఆయనను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా హరిబాబును నానక్ రామ్ గూడ లోని స్టార్ హాస్పిటల్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: దారుణం.. 20 రోజులుగా హోటల్లో బంధీగా బాలిక నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన 19 ఏళ్ల బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆమెను హైదరాబాద్‌కు రప్పించి నారాయణగూడలోని ఓ హోటల్లో 20 రోజులు బంధించాడు. చివరికి సమాచారం మేరకు పోలీసులు ఆమెను రక్షించారు. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kannayya Naidu: మొన్న తుంగభద్ర, నేడు ప్రకాశం బ్యారేజ్ గేట్ల రిపేర్.. ఎవరీ కన్నయ్య నాయుడు? ప్రస్తుతం నాగినేని కన్నయ్యనాయుడు పేరు మారుమోగిపోతోంది. కర్ణాటకలో తుంగభద్ర , ఇటీవల ప్రకాశం బ్యారేజ్ గేట్లను రిపేర్ చేసి ఈ డ్యామ్‌లను కాపాడటంలో ఈయనే కీలక పాత్ర పోషించారు. కన్నయ్యనాయుడి గురించి మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు వరద బాధితుల కోసం రూ.కోటి అందించిన లలితా జ్యువెలర్స్ ఎండీ ఏపీలోని వరద బాధితుల సహాయార్ధం లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఈరోజు సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా సీఎం ఆయనను అభినందించారు. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ AP, TG Floods: వరద బాధితులకు LG సంస్థ శుభవార్త.. ఆ సేవలు ఫ్రీ, 50% డిస్కౌంట్ కూడా! ఖమ్మం, విజయవాడలో వరద బాధితులకు ప్రముఖ LG సంస్థ శుభవార్త చెప్పింది. దెబ్బతిన్న తమ కంపెనీ పరికరాలకు ఫ్రీగా సర్వీస్ చేస్తామని ప్రకటించింది. ఇంకా పాడైపోయిన స్పేర్ పార్ట్స్ పై 50% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ఖమ్మం, విజయవాడలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఖమ్మం: తగ్గిన వరద.. ఆ రూట్లో రాకపోకలకు పోలీసుల అనుమతి ఖమ్మం జిల్లాలో తీగల బంజారా వాగు వరద ఉధృతి తగ్గింది. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు రహదారి పై ట్రాఫిక్ ను అనుమతిస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం సీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నాడు.. నేడు.. నాకు స్ఫూర్తి కాళోజీ: సీఎం రేవంత్ ప్రముఖ తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. నిన్న ప్రశ్నించే గొంతుకగా… నేడు ప్రజా పాలకుడిగా.. తనకు స్ఫూర్తి కాళోజీ అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao: ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జోస్యం చెప్పారు. ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn