CPI: ఖమ్మంలో ఘనంగా సీపీఐ శతాబ్జి వేడుకలు.. బీజేపీపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్

ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. SRBGNR డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీపై తీవ్రంగా విమర్శలు చేశారు.

New Update
CM Revanth key Comments on CPI’s centenary celebrations

CM Revanth key Comments on CPI’s centenary celebrations

ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. SRBGNR డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు దేశ, విదేశాల నుంచి ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్రంగా విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని చెరబెట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి జాతీయ ఉపాధి హామీ స్కీమ్ తీసుకొస్తే బీజేపీ ఆ పథకాన్ని రద్దు చేసిందన్నారు. రాజ్యాంగాన్ని చేరబెట్టేందుకు వాళ్లు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అలాగే పేదల ఓట్లు తొలగించేందుకే SIRను తీసుకొచ్చారని విమర్శించారు. శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

రజాకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేశారని... సాయుధ రైతాంగ పోరాటంలో 4 వేల మంది వీరులు అమరులైనట్లు గుర్తుచేశారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నిలబడుతోందన్నారు. కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఖమ్మంలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చేసేందుకు, పేదల హక్కులు కొల్లగొట్టేందుకు బీజేపీ 400 సీట్లు అడిగినట్లు ఆరోపించారు. రాహుల్‌గాంధీ, కమ్యూనిస్టుల దగ్గరకి వెళ్లడంతో 240 సీట్లకే ఆ పార్టీ పరిమితమైపోయినట్లు ఎద్దేవా చేశారు. 

Advertisment
తాజా కథనాలు