Crime News: నీలి చిత్రాల్లో ఆఫర్‌ అంటూ హోటల్ రూమ్‌కి తీసుకెళ్లి...

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఒక వివాహిత డబ్బుకు ఆశపడి చేసిన పనికి సర్వం కోల్పోయింది. నీలి చిత్రాల్లో నటిస్తే లక్షల్లో డబ్బు ఇస్తామని ఆశపెట్టి..ఆమెను హోటల్ గదికి తీసుకెళ్లిన దుర్మార్గులు దారుణానికి ఒడిగట్టారు. గుర్తు తెలియని దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు.

New Update
FotoJet - 2026-01-19T104653.013

A woman deceived by the desire for money

Crime News: ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఒక వివాహిత డబ్బుకు ఆశపడి చేసిన పనికి సర్వం కోల్పోయింది. నీలి చిత్రాల్లో నటిస్తే లక్షల్లో డబ్బు ఇస్తామని ఆశపెట్టి.. ఆమెను హోటల్ గదికి తీసుకెళ్లిన దుర్మార్గులు దారుణానికి ఒడిగట్టారు. గుర్తు తెలియని దుండగులు ఆమెపై అత్యాచారం చేసి ఆ తర్వాత డబ్బు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పుకుని బోరుమంది. సమాజంలో సాంకేతికత ఎంత వేగంగా పెరిగితే అంతా వేగంగా మోసాలు పెరుగుతున్నాయి. నేరగాళ్లు కూడా సాంకేతికను ఆసరా చేసుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆడవారితో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజల ఆర్థిక ఇబ్బందులను, అవసరాలను ఆసరాగా చేసుకుని నేరగాళ్లు విసిరే వలలో సామాన్యుల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మహానగరంలో వెలుగుచూసిన ఒక దారుణమైన ఘటన మహిళలు ఎలా మోసపోతున్నారో కళ్లకు కట్టింది.

Also Read: గులాబీ పార్టీలో గ్రూప్ వార్.. తలలు పట్టుకుంటున్న అధిష్టానం

వివరాల్లోకి వెళితే.. నీలి చిత్రాలలో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తాం అంటూ కొందరు దుర్మార్గులు ఒక వివాహితకు ఆఫర్ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సదరు మహిళ డబ్బు కోసం వారు చెప్పిన మాటలను నమ్మింది. ఇందులో భాగంగానే ఆ మహిళను ఒక హోటల్ గదికి తీసుకెళ్లిన కేటుగాళ్లు.. షూటింగ్ పేరుతో ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. తీరా పని పూర్తయ్యాక.. ఆమెకు ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా ముఖం చాటేయడంతో తాను నిలువునా మోసపోయానని ఆ బాధితురాలు గుర్తించింది. ఈ మోసంపై బాధితురాలు వెంటనే యూసఫ్‌గూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తు్న్నారు. నిందితులు ఎవరు ? దీని వెనుక ఏదైనా పెద్ద ముఠా ఉందా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు, అపరిచితులు ఇచ్చే భారీ ఆఫర్ల వెనుక ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం డబ్బు కోసమే కాకుండా, బ్లాక్‌మెయిలింగ్ ద్వారా మహిళల జీవితాలను నాశనం చేసే ఇటువంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read: ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలి : ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

డిజిటల్ యుగంలో ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చే లింకులు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్లు లేదా సినిమా అవకాశాలు అంటూ వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మకూడదని పోలీసులు కోరుతున్నారు. అపరిచితులతో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం, రహస్య ప్రాంతాలకు వెళ్లడం వంటివి ప్రాణాలకే ముప్పు తెస్తాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగినప్పుడు వెంటనే డయల్ 100 లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించడం ద్వారా ఇటువంటి నేరగాళ్లకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisment
తాజా కథనాలు