/rtv/media/media_files/2026/01/19/fotojet-2026-01-19t072616-2026-01-19-07-27-20.jpg)
An OC Commission should be formed
Poladi Rama Rao : జాతీయ. రాష్ట్రాల స్థాయిలో చట్ట బద్ధత గల ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఐకాస రాష్ట్ర నాయకుల సన్నాహక సమావేశం లో ఆయన తో,ఓసి జేఏసీ జాతీయ ఉపాధ్యక్షులు చందుపట్ల నరసింహ రెడ్డి, ప్రధానకార్యదర్శి గట్టు మహేష్ బాబు, ప్రచార కార్యదర్శి గూడూరి స్వామి రెడ్డి లు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ కోసం కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే వెంటనే భర్తీ చేయాలని , ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి ఆదాయ పరిమితిని 10లక్షలరూ. లకు పెంచాలని డిమాండ్ చేశారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/19/fotojet-2026-01-19t072631-2026-01-19-07-27-55.jpg)
వయోపరిమితి పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని కోరారు. తమ డిమాండ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఫిబ్రవరి నెల 27 న ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద 10 వేల మందితో నిర్వహించే మహ ధర్నా కు ఓసీ లందరూ రాజకీయాల కతీతంగా అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా మహా ధర్నా గోడ ప్రతులను కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐకాస జాతీయ ఉపాధ్యక్షుడు చందుపట్ల నరసింహ రెడ్డి ప్రధానకార్యదర్శి గట్టు మహేష్ బాబు ప్రచార కార్యదర్శి గూడూరి స్వామి రెడ్డి , రెడ్డి జేఏసీ రాష్ట్ర ప్రథాన కార్యదర్శి తౌటి రెడ్డి రాజిరెడ్డి ఆల్ ఇండియా వెలమ సంఘం అధ్యక్షుడు దివాకర్ రావు. రాష్ట్ర టింబర్ డిపో అధ్యక్షుడు చకిలం రమణయ్య,వైశ్య ఫెడరేషన్ నాయకులు సింగిరి కొండ నర్సింహుల గుప్త మహంకాళి రాజన్న, చకీలం రాజు, విశ్వేశ్వర్ రావు బ్రాహ్మణ సంఘం జేఏసీ అధ్యక్షుడు దీపక్ బాబు, కమ్మ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాయపాటి వెంకటేశ్వర్ రావు తదితరుల తో పాటు రాష్ట్ర ఐకాస నాయకులు వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Follow Us