BIG BREAKING: రేవంత్‌కు దిమ్మ తిరిగే బదులిస్తాం: హరీశ్‌ రావు

ఖమ్మం సభలో బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. రేవంత్‌ రెడ్డిది ద్రోహ చరిత్ర అంటూ ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు.

New Update
Harish Rao Responds on CM Revanth Over BRS party remarks

Harish Rao Responds on CM Revanth Over BRS party remarks

ఖమ్మం సభలో బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. రేవంత్‌ రెడ్డిది ద్రోహ చరిత్ర అంటూ ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు. ''అడుగడుగునా వెన్నుపోట్లు, అనుక్షణం  అబద్ధాలు.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే  ద్రోహాల పుట్ట. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్.చంద్రబాబు తరపున నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ రేవంత్. NTR  ద్వేషించిన కాంగ్రెస్‌లో చేరి.. నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి. 

Also Read: బెంగాల్‌లో అధికారంలోకి వస్తే వాళ్లని తరిమికొడతాం.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటే  రేవంత్ మాత్రం BJPని మోస్తున్న TDPపై అభిమానం కురిపించడం వెనుక మతలబు ఏంటి ?. బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్  వ్యవహారశైలి ఉంది. ఆయన రాజకీయం చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోంది. BRS జెండా దిమ్మెలను కూల్చాలని పిలుపునివ్వడం అంటే శాంతిభద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే. BRS దిమ్మెలు కూలగొడితే రేవంత్‌కు దిమ్మతిరిగేలా బదులిస్తామంటూ'' హరీశ్ రావు రాసుకొచ్చారు.

Also Read: మచాదోకు రెడ్ బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చిన ట్రంప్..అందులో ఏముందో తెలుసా!?

Advertisment
తాజా కథనాలు