/rtv/media/media_files/2026/01/18/telangana-cabinet-in-medaram-2026-01-18-20-54-07.jpg)
Telangana Cabinet in Medaram
మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం మొదలైంది. తొలిసారిగా సచివాలయం బయట మేడారం వేదికగా మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. కానీ సెలవుగా ప్రకటించలేదు. అయితే కేబినెట్ సమావేశంలో సెలవు ప్రకటించే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: దండకారణ్యంలో కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి
అలాగే ములుగు నియోజకవర్గం అభివృద్ధిపై కూడా కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కేబినెట్ ఆమోదం తెలపనుంది.
Also Read: రేవంత్‌కు దిమ్మ తిరిగే బదులిస్తాం: హరీశ్ రావు
ఇక మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పరిశీలించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఏఐ టెక్నాలజీ పనితీరును పర్యవేక్షించారు. ఆ తర్వాత మేడారం జాతర భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Follow Us