BRS: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన ఇద్దరు మహిళా మంత్రులు..ఎందుకంటే?

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఈరోజు (జనవరి 8) మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. రాజకీయ విభేధాలను పక్కనపెట్టి మంత్రులిద్దరూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

New Update
FotoJet (99)

Konda surekha, Danasari Seethakka meet KCR

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మంత్రులు సీతక్క(Minister Seethakka), కొండా సురేఖ(minister-konda-sureka) గురువారం (జనవరి 8) మాజీ సీఎం కేసీఆర్(telangana-ex-cm-kcr) ఫామ్‌హౌస్‌(KCR farmhouse)కు వెళ్లారు. ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య ఉన్న రాజకీయ విభేధాలను పక్కనపెట్టి మహిళా మంత్రులిద్దరూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.ఈ అరుదైన ఘటనకు సమ్మక్క, సారలమ్మజాతర కారణం కావడం గమనార్హం.మేడారం సమ్మక్క, సారక్క మహా జాతరకు రావలసిందిగా కేసీఆర్‌ను కోరేందుకు వారిద్దరూ ఫాంహౌజ్‌కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

WhatsApp Image 2026-01-08 at 5.19.30 PM

ఈ సందర్భంగా రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క ఇవాళ సాయంత్రం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వేళ్లారు. వారికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్  సాదర స్వాగతం పలికారు. ఇద్దరికీ మొక్కలు అందజేసిన సంతోష్‌కుమార్ వారిని కేసీఆర్‌ వద్దకు తీసుకు వెళ్లారు.కాగా మంత్రులిద్దరూ త్వరలో జరగబోయే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం ‘సమ్మక్క-సారలమ్మ మహా జాతర’(Medaram Jatara - 2026) కు ప్రభుత్వం తరఫున హాజరు కావాలని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ దంపతులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రులు కేసీఆర్‌కు శాలువా కప్పి, జాతర ఆహ్వాన పత్రికతో పాటు మేడారం ప్రసాదాన్ని అందజేయడం విశేషం.

కాగా కేసీఆర్‌ దంపతులు సైతం అంతే మర్యాదగా వారిని రిసీవ్‌ చేసుకున్నారు. తమ నివాసానికి వచ్చిన మహిళా మంత్రులకు కేసీఆర్, శోభమ్మ దంపతులు ఘనస్వాగతం పలికారు. వారిని చూడగానే కేసీఆర్‌ బాగున్నారా అమ్మా అంటూ అప్యాయంగా పలకరించారు.వారిద్దరినీ కేవలం  రాజకీయ నాయకులు రాళ్లుగానే కాకుండా, ఇంటికి వచ్చిన ఆడబిడ్డళ్లలాగా ఆహ్వానించిన కేసీఆర్‌ దంపతులు వారికి పసుపు, కుంకుమతో కూడిన చీరెసారెను అందజేశారు. . అనంతరం వారితో కలిసి ఛాయ్‌ తాగారు.  కాసేపు ఇష్టాగోష్టిగా యోగక్షేమాలు తెలుసుకున్నారు.

Also Read :  జిల్లాల పునర్వ్యవస్థీకరణ... తెరపైకి కొత్త జిల్లాల ఉద్యమం? ఎక్కడెక్కడ అంటే?

మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర..

కాగా, దేశంలోనే అతిపెద్దదైన గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర.. జనవరి 28న ప్రారంభమై జనవరి 31న ముగియనుంది. ఈ పండుగకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పా్ట్లు చేశారు. సంక్రాంతి సెలవులు కూడా ఉండటంతో ఈసారి జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. అందుకే ఈ వనదేవతల మహా జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. భారీగా నిధులు కేటాయించింది.

ఈసారి జతరకు సమ్మక్క, సారక్క గద్దెలు కొత్త హంగులతో ముస్తాబవుతున్నది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా   గతంలో గద్దెల చుట్టూ ఉన్న ఇనుప నిర్మాణాలను తొలగించి సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో సమ్మక్క-సారక్క గద్దెలను నిర్మిస్తున్నారు. గద్దెల ఎత్తును పెంచడంతో పాటు.. చుట్టూ పాలరాతి గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీని కూడా తట్టుకునేలా గద్దెల ప్రాంగణాన్ని 180 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు విస్తరిస్తున్నారు. కాగా, జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న మేడారం వెళ్లనున్నారు.ఇక మేడారం జాతర జరిగే ప్రాంతంతో పాటు పరిసర గ్రామాల్లో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం.  అంతేకాకుండా భద్రత, రవాణా, తాగునీరు, వైద్య సదుపాయాల ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని.. ఈసారి మేడారం జాతర కన్నుల పండువగా జరగనుందని అధికారులు చెబుతున్నారు.

మేడారం మహా జాతర(MEDARAM JATHARA) లో నాలుగు రోజులు ప్రధాన కార్యక్రమాలు జరుగుతాయి. జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులను గద్దెలపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. జనవరి 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెపైకి తీసుకువస్తారు. జనవరి 30న భక్తులు అమ్మవార్లకు మొక్కులు (బంగారం) సమర్పించుకుంటారు. ఇక చివరి రోజు అయిన జనవరి 31న దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

Also Read :  ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

Advertisment
తాజా కథనాలు