BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీకొంది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

New Update
BREAKING

BREAKING

రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీకొంది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ముగ్గురు ఐసీఎఫ్‌ఏఐ వర్సిటీ విద్యార్థులుగా, మరొకరు ఎంజీఐటీ విద్యార్థిగా గుర్తించారు. సూర్యతేజ, సుమిత్, రోహిత్, శ్రీనిఖిల్ మృతి చెందగా.. నక్షత్ర అనే విద్యార్థినికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లందరూ మోకిల నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  

Advertisment
తాజా కథనాలు