KCR: పార్టీ కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం.. ఏం మాట్లాడారంటే ?
మాజీ సీఎం కేసీఆర్ గురువారం పార్టీ కార్యకర్తలతో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కొంతమంది పార్టీని వీడినంత మాత్రానా ఎలాంటి తేడా జరగదని అన్నారు. నాడు ఎన్టీఆర్ తిరిగి ఎలా అయితే ప్రజల గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ను ప్రజలు ఆదరిస్తారన్నారు.