/rtv/media/media_files/2025/03/23/DIOwjXUEkabwqQJOabWI.jpg)
Sexual assault
సరదాగా బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు ముగ్గురు మృగాళ్ల చేతిలో చిక్కారు. మాయమాటలు చెప్పి పిక్నిక్(Picnic) పేరుతో యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అత్యాచారం(sexual-abuse) చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. అల్వాల్ పోలీసుల కథనం ప్రకారం.. వెంకటాపురానికి చెందిన ముగ్గురు తొమ్మిదవ తరగతి విద్యార్థినీలు బడిలో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని ఇంట్లోవాళ్లకు చెప్పి ఈనెల 20న ఉదయం 7:30కే ఆధార్ కార్డులు పట్టుకొని బయటకు వెళ్లారు. అయితే ఆ ముగ్గురు స్కూలుకు వెళ్లకుండా ఆల్వాల్ గోల్నాక చౌరస్తావద్ద బస్సెక్కి సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి మరో బస్సులో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దిగారు. అక్కడికి దగ్గర్లోని ఓ బస్టాపు వద్ద నిల్చున్నారు. ఈ లోపు ఓయూ మాణికేశ్వరి నగర్‌కు చెందిన, జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 19 ఏళ్ల యువకుడు గండికోట్ మధు(19) బాలికలను చూసి వారితో మాటలు కలిపాడు. అనంతరం.. . అతడి స్నేహితులు వారాసిగూడకు చెందిన గడ్డం వంశీ అరవింద్(22), అతడి సమీప బంధువు మల్లేశ్వర్‌నగర్‌కు చెందిన ఈసం నీరజ్(21)ను పిలిచాడు.
Also Read : Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు బిగ్ షాక్.. రష్యా మరో సంచలన వ్యూహం
Three Girls Missing Case
అనంతరం అందరూ కలిసి ఓ హోటల్‌లో భోజనం చేశారు. మంచిగా మాట్లాడటంతో బాలికలకు వీరిపై నమ్మకం పెరిగింది. సరదాగా బయటకు వెళ్దామని అందరూ అనుకుని బస్సులో యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. అక్కడే లాడ్జిలో మూడు వేర్వేరు గదులు అద్దెకు తీసుకున్నారు. ఆరుగురు కలిసి బస్సులో యాదగిరిగుట్టకు వెళ్లారు. గుట్టపై దర్శనం అనంతరం లాడ్జ్‌లో గదులు అద్దెకు తీసుకున్నారు. రాత్రంతా ఆ గదిలోనే ఉన్నారు. ఆ రాత్రి బాలికలపై అత్యాచారానికి(9sexual assault case) పాల్పడ్డారు. 21వ తేదీన ఆరుగురు కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. ఓయూ పీఎస్ పరిధిలో బాలికలను వదిలిపెట్టి, ముగ్గురు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read: న్యూ యార్క్ లో మొబైల్ హ్యాకింగ్..ఐరాస సమీపంలో రహస్య టెలికాం నెట్ వర్క్
అయితే 20వ తేదిన ముగ్గురు విద్యార్థినీలు బడికి రాకపోవడంతో ఓ టీచర్.. తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. పిల్లలు బడికి వెళ్లలేదని తెలిసి ఆందోళనకు గురైన బాలికల తల్లిదండ్రులు స్నేహితుల ఇళ్లలో ఎంక్వయిరీ చేసిన ఫలితం లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మర్నాడు ఆదివారం ఉదయం ఓయూ పీఎస్ పరిధిలోంచి బాలికలే తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. తాము యాదగిరిగుట్టకు వెళ్లివచ్చామని చెప్పారు. అయితే వారు గట్టిగా నిలదీసేసరికి.. జరిగిదంతా చెప్పారు. తమపై యువకులు పాల్పడ్డ దారుణాన్ని కన్నవారికి వెల్లడించారు. అల్వాల్ పోలీసులు బాధితుల్ని భరోసా కేంద్రానికి తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు. వైద్య పరీక్షలు చేయించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. పోలీసులు నిందితులతోపాటు గది అద్దెకు ఇచ్చిన సోమేశ్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.