/rtv/media/media_files/2025/09/23/russia-2025-09-23-15-57-36.jpg)
Ukraine faces new test as Russia steps up its drive to seize Donetsk’s fortress belt
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా యుద్ధం ఆపేందుకు యత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇక రష్యా కూడా దూకుడు పెంచుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన దొనెట్స్క్‌ను స్వాధీనం చేసుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 70 శాతానికి పైగా పట్టు సాధించింది. మిగిలిన 30 శాతం కూడా తమ భూభాగంలో తమ భూభాగంలో కలిపేసుకోవాలని భావిస్తోంది.
Also Read: నిరుద్యోగులకు దసరా కానుక.. 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే!
ఉక్రెయిన్ పారిశ్రామిక రంగానికి దొనెట్స్క్ కీలక ప్రదేశంగా ఉంది. ఒకవేళ దీన్ని ఉక్రెయిన్ పూర్తిగా ఆక్రమించుకుంటే ఉక్రెయిన్ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోర్ట్రెస్ బెల్డ్‌గా పిలిచే నాలుగు నగరాలకే ఇప్పటిదాకా ఉక్రెయిన్ దళాలు పరిమితం అయ్యాయి. ఇక్కడ చాలారోజుల నుంచి మాస్కో దళాలను ఉక్రెయిన్ బలగాలు అడ్డుకుంటున్నాయి. కానీ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో బలగాల కొరత ఉండటంతో రష్యాకు ఇది అనుకూలంగా మారింది. దీని ఫలితంగా ఉక్రెయిన్ బలగాలను వెనక్కి నెట్టేందుకు రష్యా దూకుడుగా వ్యవహరిస్తోంది.
Also Read: హెచ్ 1-బీ వీసా ఫీజుల నుంచి డాక్టర్లకు మినహాయింపు..ఆలోచనలో ట్రంప్ సర్కార్
ఛాసివ్‌యార్, భక్ముత్ లాంటి చోట్ల జరిగిన యుద్ధాల్లో నష్టం జరగడంతో రష్యా కొత్త వ్యూహాలు ఎంచుకుంది. చిన్న బృందాలుగా ఏర్పడి ఉక్రెయిన్ సైనిక యూనిట్లలోకి చొరబడుతున్నారు. వీటిలో కొన్ని టీమ్స్ కూడా విజయం సాధిస్తున్నాయి. ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లు, బేస్‌మెంట్లను ఆక్రమించడం అలాగే ఉక్రెయిన్ సైనికుల కోసం వెళ్లే సరఫరాలను అడ్డుకోవడం లాంటి పనులకు పాల్పడుతున్నారు. డ్రోన్లు, గ్లైడ్ బాంబుల సాయంతో ఉక్రెయిన్ సరఫరా మార్గాలను రష్యా దెబ్బతీస్తోంది. దీనివల్ల సరిహద్దులకు సరకులు, ఆయుధాలు చేరకపోవడం వల్ల కీవ్ సేనలు బలహీనపడుతున్నాయి.
Also Read: అమెరికాలో హనుమంతుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ట్రంప్ పార్టీ నాయకుడే!
ఈ ఏడాది వేసవిలో రష్యా బలగాలు దొనెట్స్క్ ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతల్లో దాడులను పెంచాయి. మొత్తంగా ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాలన్నదే రష్యా ప్లాన్. ఉత్తర డొనెట్స్క్‌లోని లేమన్ పట్టణం కీలకంగా మారింది. రైల్వే లింక్స్ అనేవి ఇక్కడి నుంచే ఉన్నాయి. అలాగే డజన్ల కొద్ది బాంబు షెల్డర్లు, బేస్‌మెంట్లు కూడా ఉన్నాయి. రష్యా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటే ఇక్కడ బలగాలను రెడీ చేసుకొని సివెరెస్కీ డొనెట్స్ నదిని దాటేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఉక్రెయిన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అలాగే పోక్రోవస్క్ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోంది. వీటిని స్వాధీనం చేసుకుంటే దొనెట్స్క్ ప్రాంతం పూర్తిగా రష్యా చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Ukraine Braces As Russia Steps Up Drive To Seize Donetsk's Fortress Belthttps://t.co/qNyWscp3O6pic.twitter.com/MROnQcvJov
— NDTV WORLD (@NDTVWORLD) September 23, 2025
Also Read: ఎంపీ భార్యను డిజిటల్ అరెస్టు చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.14 లక్షలు కాజేసి..