USA: న్యూ యార్క్ లో మొబైల్ హ్యాకింగ్..ఐరాస సమీపంలో రహస్య టెలికాం నెట్ వర్క్

న్యూయార్క్ లో ఈరోజు ఐక్యరాజ్య సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి ముందు అక్కడకు దగ్గరలో అతి పెద్ద మొబైల్ హ్యాకింగ్ ను కనిపెట్టింది అమెరికా సీక్రెట్ సర్వీసెన్. దానిని వెంటనే నిర్వీర్యం చేసింది. 

New Update
new york

150 మంది ప్రపంచ నేతలు పాల్గొనే  సమావేశాన్ని టార్గెట్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మొబైల్ హ్యాకింగ్ ద్వారా సమావేశానికి ఆటంకం కలిగించడమే కాకుండా..నేతల ఫోన్లనూ ట్యాప్ చేసే కుట్ర పన్నారు. అయితే ఐరాస సమావేశానికి కొద్ది సేపటి ముందే దీన్ని యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ గుర్తించింది. భారీ రహస్య టెలికాం నెట్ వర్క్ ను పూర్తిగా తొలగించింది.

ఐరాస కార్యాలయానికి సమీపంలో.. 

న్యూ యార్క్ లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి 35 మైళ్ళ దూరంలో ఒక స్థావరంలో లక్ష సిమ్ కార్డులు, 300 కంటే ఎక్కువ సర్వర్లతో కూడిన టెలికాం నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకున్నారు దుండగులు. వీటి ద్వారా మొబైల్ బ్యాకింగ్ కు పాల్పడాలని భావించారు.  అయితే సీక్రెట్ సర్వీసెస్ జోక్యంతో పెద్ద ముప్పు తప్పింది.  ఈ మధ్య కాలంలో అమెరికాలో బయటపడ్డ అతి పెద్ద కమ్యూనికేషన్ ముప్పుల్లో ఇది ఒకటని అక్కడి అధికారులు తెలిపారు.  రహస్య స్థావరంలో ఏర్పాటు చేసిన వ్యవస్థతో మొత్తం న్యూ యార్క్ లో మొబైల్స్ సేవలన్నింటినీ బ్లాక్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.  దాంతో పాటూ యూఎస్ ఎమర్జెన్సీ సర్వీస్ అయిన 911 ను కూడా హ్యాక్ చేయాలని చూశారని తెలిపారు. 

న్యూ యార్క్ మొత్తం స్తంభింపచేసేలా..

ఐరాస సర్వసభ్య సమావేశంతో న్యూ యార్క్ నగరం సందడిగా మారింది. అక్కడ హోటళ్ళన్నీ ప్రపంచాధి నేతలతో నిండిపోయాయి. వీరందరినీ కూడా హ్యాకర్లు టార్గెట్ చేశారని సీక్రెట్ సర్వీసెస్ అధికారులు చెబుతున్నారు. మౌలిక లక్ష్యాలను బ్లాక్ చేయడం ద్వారా ఇబ్బందులకు గురిచేయాలని భావించారని చెప్పారు.  సీనియర్ ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని టెలికమ్యూనికేషన్ బెదిరింపులపై సీక్రెట్ సర్వీస్ చేపట్టిన విస్తృత దర్యాప్తులో భాగంగా ఈ నెట్ వర్క్ బయటపడిందని అధికారులు తెలిపారు.  బహుళ సైట్లలో విస్తరించి ఉన్న ఈ సర్వర్లు మాక్ సెల్ ఫోన్  బ్యాంకుల్లా పని చేస్తాయని..  ఇవి మాస్ కాల్స్, టెక్ట్స్ లను రూపొందించగలవని చెబుతున్నారు. దాంతో పాటూ స్థానిక నెట్ వర్క్ లను కూడా ఇవి స్తంభింపచేయగలవని అన్నారు.  ఇలాంటి భారీ నెట వర్క్ లను తక్కవ అంచనా వేయలేమని అంటున్నారు అధికారులు. సెల్ టవర్లను కూల్చి వేసి..ప్రజల కమ్యూనికేషన్ ను పూర్తిగా బంధించగలవని చెబుతున్నారు.  అదే కనుక జరిగి ఉంటే న్యూ యార్క్  మొత్తం అల్లకల్లోలం అయిపోయి ఉండేదని తెలిపారు. అంతకు ముందు సెప్టెంబర్ 11 , బోస్టన్ మారథాన్ బాంబు దాడుల తర్వాత నెట్ వర్క్ లు ఇలానే కుప్పకూలాయని మెక్ కూల్ అనే అధికారి చెప్పారు.  ఇలాంటివిమిగతా నగరాల్లో కూడా జరుగుతూ ఉండవచ్చని అనుమానం వెలిబుచ్చారు. 

Also Read: Macron: ట్రంప్ కోసం ఫ్రీజ్.. ట్రాఫిక్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడి పాట్లు

Advertisment
తాజా కథనాలు