/rtv/media/media_files/2025/04/17/rukX2LOpfHG2uIlp3Bdn.jpg)
Batti Vikramarka
రాజీవ్ యువ వికాసం స్కీమ్‌తో నిరుద్యోగుల జీవితాలు మారుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ఈ స్కీమ్ అమలుపై బ్యాంకులతో నిర్వహించిన స్పెషల్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇలా స్వయం ఉపాధి పథకాలకు ఎప్పుడూ కూడా ప్రభుత్వం కేటాయింపులు చేయలేదు. రాజీవ్ యువ వికాసం ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టించినట్లవుతుంది. ఈ స్కీమ్ ద్వారా యువతకు సహాయపడేందుకు బ్యాంకర్లు సహకారం అందించాలి.
Also Read: గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు
Also Read : టైమ్స్ ప్రభావశీలుర జాబితాలో ట్రంప్,యూనస్...భారతీయులకు దక్కని ప్లేస్!
Bhatti Vikramarka Says Rajiv Yuva Viakasam Scheme
రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కోట్లు ఖర్చు పెడుతుంది. బ్యాంకర్లు 1600 కోట్లు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాల్సి ఉంది. ఈ స్కీమ్‌లో బ్యాంకర్లు ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా మంచి పేరు దక్కుతుంది. దీని కింద లబ్ధి పొందే యువకులకు వ్యాపారం చేసుకోవడం, లాభాలు సాధించడంపై అధికారులు కనీసం 3 రోజుల నుంచి 15 రోజుల వరకు ట్రైనింగ్ ఇస్తారు. వ్యాపారంలో ఏదైనా ఇబ్బందులు వస్తే శిక్షణ సంస్థలు కూడా మద్దతిస్తాయి.
Also Read: ఛీ ఛీ.. లైవ్‌లో ముద్దులతో రెచ్చిపోయిన అఘోరీ-శ్రీవర్షిణి.. కారులో రచ్చ రచ్చ
ఈ స్కీమ్ సక్సెస్ అయ్యేందుకు బ్యాంకర్లు పరస్పరం సహకరించుకోవాలి. దీన్ని పక్బందీగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు బ్యాంకర్లతో త్వరలో మీటింగ్ నిర్వహించాలి. అర్హులకు సాంక్షన్ లెటర్స్ అందించిన తర్వాత రాష్ట్రస్థాయిలో మరోసారి ఎస్‌ఎల్బీసీ మీటింగ్ నిర్వహిస్తాం. రాజీవ్ యువ వికాసంలో లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదలవ్వగానే.. బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని విడుదల చేయాలని'' భట్టి విక్రమార్క అన్నారు.
Also Read : తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న జంటపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
telugu-news | rtv-news | Rajiv Yuva Vikasam | latest telangana news | telangana news today | telangana news live updates | breaking news in telugu | latest-telugu-news | today-news-in-telugu