/rtv/media/media_files/2025/04/17/QQ6gJSvYgQN7A7Nc4bvd.jpg)
Marriage
తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఓ జంటకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ జంట ఒక్క కారణం చూపించి పోలీసు రక్షణ కోరలేరని చెప్పింది. వారి జీవితానికి, స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉంటే తప్ప భద్రత కల్పించలేమని స్పష్టం చేసింది. జంటలు ఒకరికొకరు అండగా నిలుస్తూ సమాజాన్ని ఎదుర్కోవాలని కోర్టు సూచనలు చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటేఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయ, కేసర్వానీ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. దీంతో వాళ్లకు రక్షణ కల్పించాలని ఇటీవల ఆ భార్యాభర్తలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తమ వైవాహిక జీవితంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇక వీళ్ల పిటిషన్‌పై విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. '' ఈ దంపతులు పిటిషన్‌ను పరిశీలించాక వీళ్లకు ఎలాంటి ముప్పు పొంచి లేదని తెలుస్తోంది. కేవలం తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నంత మాత్రాన దంపతులకు పోలీసు రక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదని గతంలో ఇలాంటి కేసుపైనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
Also Read: భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
దాని ఆధారంగానే తాజా పిటిషన్‌పై కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ కేసులో పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ప్రమాదం ఉందని చెప్పేందుకు ఒక్క కారణం కూడా కనిపించలేదని తెలిపింది. నిజంగా ముప్పు ఉండే కేసులకు మేము రక్షణ కల్పిస్తామని స్పష్టం చేసింది. ఎలాంటి ప్రమాదం లేనప్పుడు సమాజాన్ని ఎదుర్కోవడం కోసం దంపతులు ఒకరికొకరు అండగా నిలబడాలని'' ధర్మాసనం చెప్పింది. చివరికి వీళ్ల పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.
telugu-news | rtv-news | national-news