Telangana: గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో రూ.27 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడ్కోతో రెండు ప్రైవేట్ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. 2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తి తమ లక్ష్యమని భట్టి విక్రమార్క అన్నారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Batti Vikramarka

Batti Vikramarka

తెలంగాణలో 2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్‌ పవర్‌ (హరిత ఇంధనం) ఉత్పత్తి లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్లాన్‌ రూపొందించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీని అమలులో భాగంగా జనవరిలో క్లీన్ అండ్ గ్రీన్ పవర్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Also Read: భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

Also Read: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Batti Vikramarka Key Comments On Green Power Plants

 ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.27 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు  రెడ్కోతో ఈ-కోరెన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, జీపీఎస్‌ రెన్యూవబుల్స్‌ ఆర్యా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ క్రమంలో భట్టి విక్రమార్క పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''దాదాపు 5600 మెగావాట్ల గ్రీన్ పవర్‌ ప్లాంట్‌ల ఏర్పాటుకు ఈ రెండు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి.  సీఎ రేవంత్ దావోస్‌ వెళ్లినప్పుడు సన్‌ పెట్రో అనే కంపెనీ 3400 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 

Also Read: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

మేఘా కంపెనీ రూ.7500 కోట్ల పెట్టుబడులతో రూ.1500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ముందుకొచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌ బాగా పెరిగింది. 17,162 మెగావాట్లకు చేరుకుంది. అయినా కూడా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 2035 నాటికి 31,809 మెగావాట్లకు చేరుకోనుంది. అందుకే రాష్ట్రాన్ని కాలుష్యం బారిన పడకుండా చేసేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టామని'' భట్టి విక్రమార్క అన్నారు.  

Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!

 

rtv-news | batti-vikramarka | latest telangana news | breaking news in telugu | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు