/rtv/media/media_files/2025/05/26/U8a0fPxcJUJR71FubtJT.jpg)
Lalu Prasad Yadav son Tej Prasad love case issue
Lalu Prasad Yadav: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో మరో వివాదం చర్చనీయాంశమైంది. లాలూ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ మరో యువతితో రిలేషన్‌షిప్ పోస్టు నెట్టింట వైరల్ కావడంతో తేజ్ భార్య ఐశ్వర్యరాయ్ షాకింగ్ ఆరోపణలు చేశారు. భార్య ఉండగానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్న కొడుకు గురించి తనకు ముందే ఎందుకు చెప్పలేదని లాలూ కుటుంబాన్ని ఐశ్వర్య ప్రశ్నించింది. అనవసరంగా తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశారంటూ మండిపడింది.
ఇదంతా ఎన్నికల స్టంట్..
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య.. 'తేజ్ కుటుంబం గురించి ప్రతి విషయం నాకు తెలుసు. నన్ను కొట్టి, టార్చర్ చేసినపుడు సామాజిక న్యాయం గుర్తురాలేదా? అప్పుడు ఎక్కడికి పోయింది? తేజ్ ను లాలూ ఇంటినుంచి వెళ్లగొట్టలేదు. వారంతా కలిసే ఉన్నారు. బిహార్ ఎన్నికల ముందు స్టంగ్ మొదలుపెట్టారు. ఈ నాటకం తేజ్‌ప్రతాప్ తల్లి రబ్రీదేవి ప్లాన్ చేశారు. నా విడాకుల గురించి మీడియా ద్వారానే తెలిసింది. వారికి నా జీవితం నాశనం చేయాల్సిన అవసరం ఏముంది? నా ఫ్యూచర్ గురించి అడగండి' అంటూ ఫైర్ అయింది.
అసలేం జరిగిందంటే..
తేజ్ ప్రతాప్ మరో మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు ప్రత్యక్షమైంది. ఆమె పేరు అనుష్క యాదవ్ అని, గత 12 ఏళ్లుగా తాము రిలేషన్‌లో ఉన్నట్లు రాసుకొచ్చారు. అయితే ఇదంతా ఫేక్ అని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ఎవరు నమ్మొద్దని కోరారు. ఈ అంశంపై తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు లాలూ ప్రకటించారు. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించేలా చర్యలున్నాయని, సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న సమష్టి పోరాటాన్ని బలహీనపరుస్తున్నాయని లాలూ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇక తేజ్ ప్రతాప్ 2018లో బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో విభేదాలు రావడంతో ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటోంది.