/rtv/media/media_files/2025/05/26/m1F0B1ZqNcx89EfDxPZ1.jpg)
iQOO Neo 10 Price
ప్రముఖ టెక్ బ్రాండ్ ఐక్యూ కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లో లాంచ్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. తాజాగా iQOO Neo 10 పేరుతో కొత్త ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి.
ఇది కూడా చూడండి: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)
iQOO Neo 10 Price
భారతదేశంలో iQOO Neo 10 నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో
8GB + 128GB వేరియంట్ ధర రూ. 31,999
8GB + 256GB వేరియంట్ ధర రూ.33,999
12GB + 256GB వేరియంట్ రూ.35,999
16GB + 512GB RAM వేరియంట్ ధర రూ.40,999గా కంపెనీ నిర్ణయించింది.
Today, I'm giving away the iQOO Neo10 to the #stufflistingsarmy 😍
— Mukul Sharma (@stufflistings) May 26, 2025
To win:
1. Like this post
2. Quote repost using #winiQOONeo10 #iQOONeo10 #DualChipPower
3. Answer some questions
Happy winning ❤️ pic.twitter.com/8pAADXK2Ke
ఇది కూడా చూడండి: సంచలన అప్‌డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
ఈ ఫోన్ ఇన్ఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్ కలర్‌లలో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ కోసం ప్రీ-బుకింగ్ ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. ప్రీ బుకింగ్‌లో రూ.29,999లకే పొందొచ్చు. జూన్ 3న దేశంలోని అన్ని వినియోగదారులకు అమెజాన్, iQOO ఇండియా ఇ-స్టోర్ ద్వారా సేల్‌కు అందుబాటులో ఉంటాయి.
iQOO Neo 10 Specifications
iQOO Neo 10 స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 360Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 5,500 nits వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్, 4,320Hz PWM డిమ్మింగ్ రేట్‌తో కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 SoC, డెడికేటెడ్ Q1 గేమింగ్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ Android 15-ఆధారిత FuntouchOS 15తో వస్తుంది.
ఇది కూడా చూడండి: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
iQOO నియో 10 డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ రియర్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ ఉంటాయి. సెల్ఫీలు,వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ముందు,వెనుక కెమెరాలు రెండూ 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి. ఈ హ్యాండ్‌సెట్ 144fps గేమింగ్‌కు మద్దతు ఇస్తుందని.. బైపాస్ ఛార్జింగ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
new-mobiles | latest-telugu-news | telugu-news