Vijay Devarakonda : అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌‌కు హీరో విజయ్‌ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్స్‌ ఇచ్చారు. తన ‘రౌడీ’ బ్రాండ్‌ షీ టర్ట్స్‌, తాను వినియోగించిన షటిల్‌ బ్యాట్‌ను అతడికి అందించాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ షేర్ చేసింది.

New Update
Vijay Deverakonda Special Gift To Anirudh

Vijay Deverakonda Special Gift To Anirudh

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్‌డమ్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్‌కు ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. 

ఇది కూడా చూడండి:యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

విజయ్ స్పెషల్ గిఫ్ట్

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులోనూ టీజర్‌కు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు భారీ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. ఇలా రౌడీ బాయ్ విజయ్ ఈ మూవీతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. తరచూ ఏదో ఒక అప్డేట్ అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా మరో వీడియోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

ఇది కూడా చూడండి: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు అదరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తన ‘రౌడీ’ బ్రాండ్‌ షీ టర్ట్స్‌, తాను వినియోగించిన షటిల్‌ బ్యాట్‌ను అనిరుధ్‌కు అందించాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే చాలా మందికి తన రౌడీ బ్రాండ్ దుస్తులు అందించిన విజయ్.. ఇప్పుడు అనిరుధ్‌కు కూడా మంచి టీషర్ట్ ఇచ్చాడు. 

ఇది కూడా చూడండి:బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

అనంతరం వీరిద్దరూ కలిసి చర్చించుకున్నారు. ఇక అక్కడే విజయ్ అందించిన టీ షర్ట్‌ను అనిరుద్ వేసుకున్నాడు. అది అనిరుధ్‌కు బాగా సెట్ అయింది. అందులో అతడి లుక్ బాగుంది. ఇక విజయ్, అనిరుధ్ కలిసి చర్చించుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని జులై 4న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

Vijay Devarakonda | anirudh-ravichander | latest-telugu-news | telugu-news

Advertisment
తాజా కథనాలు