/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T091017.388.jpg)
Covid-19 Update
దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఐదేళ్ల కిందట కోవిడ్ 19 యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు మళ్లీ ప్రజలను భయాందోళన పెడుతోంది. దేశంలో ఇప్పటికి మొత్తం 478 కేసులు ఈ ఏడాదిలో నమోదయ్యాయి. ప్రస్తుతం వెయ్యికి పైగా కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. బెంగళూరులో తొమ్మిది నెలల శిశువుకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. శనివారం కర్ణాటకలో 85 ఏళ్ల వృద్ధుడు, థానేకి చెందిన 21 ఏళ్ల కుర్రాడు మృతి చెందారు. అయితే 2019లో ఆల్ఫా వేరియంట్‌తో ప్రపంచాన్ని వణికించిన ఈ కోవిడ్ ఇప్పుడు కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలను భయపెడుతోంది.
ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
గాంధీ ఆసుప్రతి ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదాల
ప్రస్తుతం దేశంలో జేఎన్1 వేరియంట్ వ్యాప్తి తక్కువగా చెందుతుందని గాంధీ ఆస్పత్రి క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదాల తెలిపారు. కొవిడ్ పాండమిక్ టైంలో ఒక వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిందన్నారు. ఆ తర్వాత వైరస్ ప్రభావం తగ్గి, కేవలం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఒక దేశంలో ఉన్న కరోనా మరో దేశంలో కనిపించడం లేదని కిరణ్ మాదాల అన్నారు. దీనిని బట్టి చూస్తే కరోనా ఎండమిక్ దశకు చేరుకుందని అంటున్నారు.
సాధారణంగా ఏదైనా వైరస్ వ్యాప్తికి పాండమిక్, ఎపిడమిక్, ఎండమిక్ అనే మూడు దశలు ఉంటాయని ప్రొఫెసర్ అన్నారు. ప్రస్తుతం సింగపూర్‌లో కనిపించిన బీ1.8.1 వేరియంట్ మళ్లీ వేరే దేశంలో లేదన్నారు. అలాగే మన దేశంలో ఉన్న ఎక్స్ఎఫ్జీ వేరియంట్ వేరే దేశంలో లేదన్నారు ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా లేదని, ఒకవేళ ఉన్నట్లయితే ప్రపంచ వ్యాప్తంగా పాకేదన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలు చేస్తోందని, త్వరలోనే కరోనా ఎండమిక్పై ప్రకటన తప్పకుండా వస్తుందని ప్రొఫెసర్ తెలిపారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
డిపిహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్
కరోనా వివిధ దేశాల్లో SARS-CoV-2 వేరియంట్‌లతో కనిపిస్తోంది. అయితే కోవిడ్ వచ్చిందని ఇప్పుడు ఆసుపత్రికి చేరాల్సిన అవసం లేదని, ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ (డిపిహెచ్) డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. 2019లో కరోనా వచ్చి ప్రజలను భయపెట్టింది.. కానీ ప్రస్తుతం స్థానిక వ్యాధిగా మారుతుందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) మాజీ డైరెక్టర్, విశిష్ట శాస్త్రవేత్త డాక్టర్ సీఎహెచ్ మోహన్ రావు అన్నారు. ఈ కరోనా 2023లో సాధారణ స్థితికి చేరుకుందని స్పష్టం చేశారు. కాకపోతే కోవిడ్ కొత్త వేరియంట్ వచ్చిన ప్రతీసారి ఇన్ఫెక్షన్లు సోకడం సాధారణమని అన్నారు.
ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)
CCMB CEO N మధుసూధనరావు
కోవిడ్ 19 ఉన్నంత ఎక్కువగా ప్రస్తుతం వైరస్ ఎఫెక్ట్ లేదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) ఇంక్యుబేషన్ సెంటర్ CEO N మధుసూధనరావు తెలిపారు. ఫస్ట్, సెకండ్ వేవ్స్‌లో గాలి ద్వారా వైరస్ సోకుతుందని రోడ్లపై బ్లీచ్ స్ప్రే చేయడం వంటివి చేశారని, ప్రస్తుతం అక్కర్లేదని అన్నారు. ఈ కోవిడ్ వస్తే ప్రస్తుతం ప్రాథమిక చికిత్స తీసుకుంటే సరిపోతుందని CEO N మధుసూధనరావు తెలిపారు.
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
ఇదిలా ఉండగా దేశంతో రెండు కొత్త వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లను గుర్తించారు. అయితే తమిళనాడులో గత నెలలో NB.1.8.1 కోవిడ్ వైరస్ నమోదు కాగా ఈ నెలలో నాలుగు LF.7 కేసులను అధికారులు గుర్తించారు. ఆసియాలో చైనాతో పాటు ఇతర ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 478 కేసులు కాగా.. 278 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బెంగళూరులో తొమ్మిది నెలల శిశువుకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. అయితే మహారాష్ట్రలో కొత్తగా 47 కొత్త కేసుల నమోదయ్యాయి.
covid-19 | covid 19 in india | covid 19 news | Covid 19 Case Updates | covid-new-varient | corona new varient in india