AP: ఆ షేర్ల బదిలీని రద్దు చేయండి..ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్
తన తల్లి విజయమ్మ, షర్మిల అక్రమంగా షేర్లను బదిలీ చేస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వైసీపీ అధినేత జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది ఎన్సీఎల్టీ.
తన తల్లి విజయమ్మ, షర్మిల అక్రమంగా షేర్లను బదిలీ చేస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వైసీపీ అధినేత జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది ఎన్సీఎల్టీ.
సరస్వతి పవర్ కార్పోరేషన్ లో వాటాలన్నీ తనవే అంటున్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ. జగన్, భారతిరెడ్డిలు ట్రిబ్యునల్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఎన్ఎల్సీటీ హైదరాబాద్ బెంచ్ కు తెలిపారు.
2025 బడ్జెట్‌పై TG ఎమ్మెల్సీ కవిత, APCC ప్రెసిడెంట్ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులో రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్నారు. పసుపు బోర్డుకు గుండు 0 అని కవిత అంటే.. ఇది యూనియన్ బడ్జెట్ కాదు బీహార్ ఎన్నికల బడ్జెట్ అని షర్మిల ఎద్దేవా చేశారు.
విమర్శలు, ఆరోపణలతో పంటి కింద రాయిలా మారిన చెల్లి షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలు YCPలో చేరేలా జగన్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఆయనే స్వయంగా ఆయా నేతలతో చర్చలు జరుపుతున్నట్లు చర్చ సాగుతోంది.
లంచాల కోసమే జగన్ అదానీతో ఒప్పందాలకు సంతకాలు పెట్టాడని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయకపోతే జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయాలన్నారు. ఈ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆరోపించారు.
మహిళల మానప్రాణాల మీద టీడీపీ, వైసీపీ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. మహిళలపై క్రైమ్ రేట్ అరికట్టలేని YCP, TDP సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఏపీ అభివృద్ధిలో చివరి స్థానం, మహిళలపై అఘాయిత్యాలలో, ప్రథమ స్థానంలో ఉందని ఫైర్ అయ్యారు.
AP: జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై షర్మిల విమర్శలు చేశారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదని.. సొంత మైకుల ముందు కాదు.. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని అంటూ చురకలు అంటించారు. చిత్తశుద్ధి ఉంటే ప్రజాసమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలన్నారు.