విజయవాడకు వరుస బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాజాగా విజయవాడ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయి బాంబ్ స్క్వాడ్ తో అక్కడికి చేరుకుని రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా బాంబు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : నాని హిట్ 3 ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. రికార్డులు బద్దలు కావడం పక్కా
Also Read : రేవంత్, స్టాలిన్, చంద్రబాబుతో ప్రధాని నవ్వులే నవ్వులు
Bomb Threat Call To Vijayawada Railway Station
బాంబు లేదని నిర్థారించుకున్నాక షాపులు ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. పోలీసులు ఈ ఫోన్ కాల్ ఎక్కడినుండి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నాలు చేయగా.. మహారాష్ట్ర లాతూర్ నుంచి ఫోన్ వచ్చినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామని బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపుల నేపథ్యంలో విజయవాడ ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు.
Also Read : గుజరాత్‌లో పాకిస్తాన్ చొరబాటుదారున్ని కాల్చి చంపిన సైన్యం
మరోవైపు ముంబయి నుంచి విశాఖ వచ్చే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టామని ఓ అగంతకుడు ఫోన్ కాల్ చేసి బెదిరించాడు. దీంతో విశాఖ రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే తనిఖీలు ప్రారంభించారు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్. బాంబు లేదని నిర్ధారణకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.
Also Read : మీకో దండంరా బాబు.. టాలీవుడ్ పై పవన్ ఫైర్!
vijayawada | bomb-threat | Andhra Pradesh | telugu-news