/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Maoist-party-birth-day.-High-alert-on-the-border-Bhadradri-Kothagudem-jpg.webp)
Telangana Karregutta operation fail 3,000 Maoists escape
‘బచావో కర్రెగుట్టలు’ఆపరేషన్ ఫెయిల్ అయిందా? 24 వేల మందితో కూడిన భద్రతా బలగాలు మావోయిస్టుల జాడను గుర్తించలేకపోయాయా? 3 వేల మంది నక్సల్స్ సులభంగా తప్పించుకున్నారా? అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.
Also Read : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీలు దుర్మరణం!
యుద్ధ వ్యూహాలు లేక్క చేయలేదా?
ఈ మేరకు ఛత్తీష్ గఢ్, ఒడిశా, దండకారణ్యం అడవుల నుంచి మావోయిస్టులు కర్రెగుట్టకు వచ్చారనే సమాచారంతో కేంద్ర, తెలంగాణ, చత్తీష్ గఢ్ రాష్ట్రాల భద్రతాబలగాలు ఆపరేషన్ చేప్టటాయి. 'బచావో కర్రెగుట్టలు' పేరిట కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఆరుగు PLGA సభ్యులను ఎన్‌కౌంటర్ చేశామని, మరికొన్ని రోజుల్లో మిగతా మావోయిస్టులను అంతం చేస్తామని పోలీసు బలగాలు, కేంద్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేశాయి. కానీ మావోయిస్టుల పన్నాగాలను గుర్తించడంలో బలగాలు ఫెయిల్ అయినట్లు అర్థమవుతోంది. దాదాపు 3వేల మంది నక్సల్స్ ఉన్నారని, డ్రోన్ ఆధారంగా గుర్తించినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు వారిజాడ కానరావట్లేదని తెలుస్తోంది. క్లిష్టమైన గుట్టల్లో యుద్ధ వ్యూహాలను లెక్కచేయకుండా మందుకెళ్లిన కేంద్ర బలగాలు ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయారనే వాదనలు పోలీసు వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
Also Read : ప్రయాణికులకు బిగ్ షాక్.. మెట్రో చార్జీల పెంపు- కొత్త ధరలు ఇవే!
కేంద్ర బలగాలకు పట్టులేదు..
మొత్తం 288 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రెగుట్టలు తెలంగాణలో 90 కిలోమీటర్ల వ్యాపించివున్నాయి. మహారాష్ట్ర ఇంద్రావతి నది వైపు, ఛత్తీస్‌గఢ్ లోనూ కొంతప్రాంతం విస్తరించాయి. అయితే ఈ గుట్టలపై కేంద్ర బలగాలకు పెద్దగా పట్టులేదు. తెలంగాణ పోలీసులు గతంలో ఆపరేషన్లు నిర్వహించినా ఈసారి అనుకున్న ఫలితం దక్కలేదు. అయితే ఇంద్రావతి ప్రాంతం గురించి మాత్రం మహారాష్ట్ర పోలీసులకు బాగా తెలుసు. కానీ వారితో సంబంధం లేకుండా ఛత్తీస్‌గఢ్ పోలీసులు, కేంద్ర బలగాల ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి.
24 వేల మంది పోలీసులు..
మరోవైపు ‘ఆపరేషన్ కగార్’లో తమకే క్రెడిట్ దక్కాలని కేంద్రబలగాలు ఆరాటపడుతున్నాయని మాజీ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆపరేషన్ లో మొదట 6 వేలు ఆ తర్వాత విడతల వారీగా 24 వేల మంది పోలీసులు ఎంటర్ అయ్యారు. కానీ కర్రెగుట్టలపై అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలం కావడతో అక్కడి ప్రతికూల వాతావరణంలో నిలదొక్కుకోలేక పోతున్నారు. అయితే ఈ ఆపరేషన్‌లో తెలంగాణ, మహారాష్ట్ర పోలీసుల సహకారం తీసుకుని ఉంటే ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలతో దాడి !.. పుతిన్ కీలక ప్రకటన
డ్రోన్లు, హెలికాప్టర్లు, థర్మల్ ఇమేజ్, ఇతరత్రా టెక్నాలజీని కేంద్ర బలగాలు వినియోగిస్తున్నాయి. కానీ మధ్యాహ్నం ఎండ, సాయంత్రం 4 దాటితే చిమ్మచీకటి. 15 మంది జవాన్లు వడదెబ్బ బారినపడగా వంద మందికి పైగా డీ-హైడ్రేషన్‌కు గురయ్యారు. దీంతో కేంద్రబలగాలకు కూంబింగ్ పెద్ద తలనొప్పిగా మారింది. కే9, కే3 డాగ్‌స్క్వాడ్స్ సహాయంతో మావోయిస్టుల భూగర్భ బంకర్లను గుర్తించారు. బాంబులను స్వాధీనం చేసుకున్నాయి. అయినప్పటికీ నక్సల్స్ ఎలా తప్పించుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ముందుగా గుట్టల చుట్టూ ఉచ్చువేసి ఆ తర్వాత వారిని బయటకు రప్పించాలి. కానీ కర్రెగుట్టలో ఈ వ్యూహం అమలుకాకపోవడంతో ఆపరేషన్ ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. నీలం కొండ, దోబే కొండలు, ఆలుబాకల్లో 3 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. కానీ ఇంకా 30కి పైగా గుట్టలను పరిశీలించాల్సివుంది.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!
today telugu news | warangal | karregutta | maoist | latest-telugu-news | latest telangana news | telangana news live updates | telangana-news-updates