/rtv/media/media_files/2025/05/04/1lmvjosXxtPDtdrYgIHK.jpg)
Vladimir Putin Rules Out Using Nuclear Weapons Against Ukraine
రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు వినియోగించే అవసరం ఉండదని అన్నారు. ఆ పరిస్థితి రాదని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల రష్యా అధికారిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్ వివాదానికి ముగింపు తీసుకొచ్చేందుకు రష్యా వద్ద బలం ఉందంటూ చెప్పుకొచ్చారు. '' ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు వాడాల్సిన అవసరం మాకు లేదు. 2022లో ప్రారంభించిన యుద్ధాన్ని రష్యా కోరుకునే లాగా ముగించేందుకు బలం, వనరులు ఉన్నాయని'' తెలిపారు.
Also Read: 'రామ్ ద్రోహి'.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన కామెంట్స్!
Vladimir Putin Rules Out
ఇదిలాఉండగా 2024 నవంబర్‌లో రష్యా అణు సిద్ధాంతం పునరుద్ధరణ పత్రాలపై పుతిన్ సంతకం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద అణు ఆయుధాగారాన్ని వినియోగించుకునేందుకు వీలు కల్పించే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు ఉక్రెయిన్‌పై ఆ అవసరం కూడా రాదని చెప్పారు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కృషి చేస్తున్నారు. దౌత్య మార్గాల్లో ఈ వివాదాన్ని ముగించాలని ట్రంప్ అన్నారు. పుతిన్ కూడా శాంతి కోసం చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Also Read : విషాదం.. వడ్ల మిషన్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి
మరికొన్నిరోజుల్లో రష్యా విక్టరీ డే కవాతు నిర్వహించనుంది. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యే విదేశీ ప్రముఖుల ప్రాణాలకు తాను హామీ ఇవ్వలేనని జెలెన్‌స్కీ ఇటీవల హెచ్చరించారు. మే 9న విక్టరీ డే 80వ వార్షికోత్సవ వేడుకులు రష్యాలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల పాటు రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ మేరకు రష్యా ముందుకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ శనివారం జెలెన్‌స్కీ రష్యా ప్రతిపాదనను తిరస్కరించారు.
Also Read : నా తండ్రితో పడుకో.. లేదంటే! భార్య నగ్నవీడియోలు తీసి భర్త వేధింపులు!
Also Read: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)
rtv-news | russia | ukraine | russia-ukraine-war | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu