Electric Scooter Offers: కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

కాలేజీ కుర్రోళ్ల కోసం అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. రూపాయి ఖర్చు లేకుండా రోడ్లపై రయ్ రయ్ మంటూ తిరొగొచ్చు. తక్కువ ధరతో ఎక్కువ మైలేజీ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు లభిస్తున్నాయి. ఓలా, హీరో విడా, హోండా వంటి కంపెనీల స్కూటర్లు ఉన్నాయి.

New Update
electric scooter offers

electric scooter offers

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా పెరిగిపోయింది. చాలా మంది ఈ స్కూటర్లపై ఆసక్తి చూపించి డబ్బులు ఆదా చేసుకుంటున్నారు. పెట్రోల్ ధరలు అధికంగా పెరగడంతో ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఫోకస్ పెడుతున్నారు. పిల్లలను స్కూల్ కు డ్రాప్ చేయడానికి, మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తేవడానికి.. ఇలా మరెన్నో పనులకు స్కూటర్లు ఉపయోగిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)

ఇదిలా ఉంటే ప్రస్తుతం సమ్మర్ హాలీడేస్ ఇచ్చారు. మరికొద్ది రోజులు అయితే కాలేజీలు ప్రారంభం అవుతాయి. రూపాయి ఖర్చు లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ పై కాలేజీకి వెళ్లాలనుకునే వారి కోసం ఇక్కడ కొన్ని స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 

ఇది కూడా చూడండి:స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మహిళకు టోకరా...రూ.2.7 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Ola S1X

Ola S1X స్కూటర్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది. ఇది మూడు వేరియంట్లలో ఉంది. అందులో

2kWh బ్యాటరీ ప్యాక్ మోడల్ ధర రూ.79,999(ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 108కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

3 kWh బ్యాటరీ ప్యాక్ మోడల్ ధర రూ.89,999గా ఉంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 176కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

4 kWh బ్యాటరీ ప్యాక్ మోడల్ ధర రూ.99,999గా ఉంది. ఇది సింగిల్ ఛార్జింగ్ పై 242కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. 

ఇది కూడా చూడండి:నోటీసులిచ్చిన అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి.. GHMCకీ హైకోర్టు ఆదేశం

Hero Vida V2

Hero Vida V2 ఎలక్ట్రిక్ స్కూటర్ లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వి2 లైట్, వి2 ప్లస్, వి2 ప్రో వేరియంట్లు ఉన్నాయి. 

వి2 లైట్ ప్రారంభ ధర రూ.74,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సింగిల్ ఛార్జింగ్ పై 94 కి.మీ మైలేజీ అందిస్తుంది.

విడా వి2 ప్లస్ మోడల్ ధర రూ.82,800గా ఉంది. ఇది 3.44కిలో‎వాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఫుల్ ఛార్జింగ్ పై 143కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. 

విడా వి2 ప్రో మోడల్ ధరరూ.1,20,300గా నిర్ణయించబడింది. ఇది 3.94కిలో‎వాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 165 కిలోమీటర్ల మైలేజీ వెళ్తుంది. 

వీటితో పాటు హోండా క్యూసి1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.90,000 గా ఉంది. 1.5 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ మైలేజ్ ఇస్తుంది. 

ఇది కూడా చూడండి:వారికి సెలవులు క్యాన్సిల్ చేయండి.. యుద్ధ వాతావరణంవేళ ఆర్మీ కీలక ప్రకటన!

latest-telugu-news | scooty | electrical-bike | electric scooter offers

Advertisment
తాజా కథనాలు