/rtv/media/media_files/2025/03/29/bWrogfZ66pO0TSm5d6f6.jpg)
Pushkaralu
తెలంగాణలో తొలిసారిగా సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు ఈ పుష్కరాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. పుష్కరాల ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఇప్పటికే రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం.
Also Read: Ayodhya: అయోధ్యలో రామయ్య దర్శనానికి 80 మీటర్ల సొరంగం
సరస్వతీ నది పుష్కరాలకు లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు, స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి పనులను సమర్థవంతంగా చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు.కాగా, తాజాగా సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ దేశంలోని భక్తులందరికీ పుష్కరాలకు చేరుకోవడానికి ఒక సమగ్ర గైడ్‌లా ఉపయోగపడుతుంది.
Also Read: BIG BREAKING: తిరుమలలో అగ్ని ప్రమాదం!
హైదరాబాద్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ ఆవిష్కరించిన ఈ యాప్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌లో సాధారణ స్నాన ఘాట్, సరస్వతీ ఘాట్ యొక్క స్థానం, ఆలయానికి వెళ్లే దారి, బస్ స్టాండ్ వంటి ప్రయాణ ప్రాంగణాలకు ఎలా చేరుకోవాలి, బండ్లు పార్క్ చేసే ప్రదేశాలు, వైద్య సహాయ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అనే వివరాలు ఉంటాయి.
అంతేకాకుండా, అన్నదాన కేంద్రాలు, ప్రసాదాల విక్రయ కౌంటర్లు, సామాన్లు భద్రపరుచుకునే ప్రదేశాల గురించిన సమాచారాన్ని కూడా ఈ యాప్ లో చూసుకోవచ్చు. పుష్కరాలకు వచ్చే భక్తులు కాళేశ్వరం సమీపంలోని ఇతర ప్రసిద్ధ దేవాలయాలైన మేడారం, రామప్ప, లక్నవరం వంటి పర్యాటక ప్రదేశాల వివరాలను కూడా ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. ఈ విధంగా, ఈ మొబైల్ అప్లికేషన్ పుష్కరాలకు వచ్చే భక్తులకు సమగ్రమైన సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో అందిస్తూ వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుందని అధికారులు తెలిపారు.
Also Read: Tirumala:భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల...శ్రీవారి దర్శనానికి 18 గంటలు!
Also Read: Tooth Pastes: ఆ టూత్ పేస్టులో డేంజర్ కెమికల్స్.. షాకింగ్ న్యూస్!
telangana | saraswati pushkaralu | app | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates