BRS బాగోతం తెలిసిపోయింది.. ఈ పోల్ పెట్టిందే అందుకు.. సీక్రెట్ చెప్పిన కాంగ్రెస్ నేత!

బీఆర్ఎస్ అసలు రూపం చూపేందుకే తాము పోల్ పెట్టామని TPCC సోషల్ మీడియా కన్వీనర్ మన్నే సతీష్‌ అన్నారు. ఫామ్ హౌజ్ పాలన, ప్రజల వద్దకు పాలన ఆప్షన్లను ఆ నేపథ్యంలోనే ఇచ్చామన్నారు. బాట్ యూజర్లతో BRS సోషల్ మీడియా ఎలా పని చేస్తోందనే అంశం ప్రజలకు అర్థం అయ్యిందన్నారు.

New Update
Telangana Congress Social Media

Telangana Congress Social Media

BRS: టీపీసీసీ(TPCC) పోల్ రిజల్ట్స్ బీఆర్ఎస్ సోషల్ మీడియా(BRS Social Media) పబ్లిసిటీ చేయడం సంతోషంగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా(Telangana Congress Social Media) కన్వీనర్ మన్నే సతీష్‌(Manne Satish) అన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అసలు రూపం తెలుసుకోవడం కోసమే తాము ఈ పోల్ పెట్టినట్లు చెప్పారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అమెరికా నుండి నడుస్తోందని ఆరోపించారు. బాట్ యూజర్స్ తో పామ్ హౌస్ పాలన కావాలని ట్యాగ్ చేశారన్నారు. కేవలం పరిపాలన విధానం గురించే పోల్ చేశామన్నారు. ప్రజల వద్ద పరిపాలన ఉండాలా? ఫామ్ హౌజ్(Farm House) పాలన ఉండాలా? అని తాము పోల్ పెట్టామన్నారు. ఇది ఏ నాయకుడికి ఈ పోల్ తో సంబంధం లేదన్నారు.

ఇది కూడా చదవండి: Revanth Vs KCR: కేసీఆర్ పాలనే బాగుంది.. సొంత 'X' ఖాతా పోల్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్!

ఇది కూడా చదవండి: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

ఆ పాలన ఎవరూ కోరుకోరు...

సమాజం పట్ల బాధ్యత ఉన్నవారు ఎవరూ ఫామ్ హౌజ్ పాలన కావాలని కోరుకోరన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌజ్ పాలన కావాలని ట్యాగ్ చేసి పోస్ట్ చేలన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం కొణతం దిలీప్ ప్రభుత్వ డబ్బులు రూ.13 కోట్లు ఖర్చు పెట్టాడని ఆరోపించారు. కాంగ్రెస్ సోషల్ మీడియాకు కార్యకర్తలు స్వచ్ఛందంగా పని చేస్తున్నారన్నారు. పార్టీ లైన్ లో తమ సోషల్ మీడియా పని చేస్తోందన్నారు. లేకుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాను తొక్కుతం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పని చేస్తున్నది పెయిడ్ వ్యక్తులన్నారు.  


ఇది కూడా చదవండి: TG Secretariate: తెలంగాణ సెక్రటేరియట్ లో సెక్యూరిటీ లోపం.. ఫేక్ ఉద్యోగి హల్ చల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు