TG Secretariate: తెలంగాణ సెక్రటేరియట్ లో సెక్యూరిటీ లోపం.. ఫేక్ ఉద్యోగి హల్ చల్!

తెలంగాణ సెక్రటేరియట్ లో ఓ ఫేక్ ఉద్యోగిని పోలీసులు గుర్తించారు. నకిలీ ఐడీ కార్డుతో హల్ చల్ చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావును అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంతో రాష్ట్ర పరిపాలన కేంద్రం అయిన సెక్రటేరియట్ సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

New Update

తెలంగాణ సెక్రటేరియట్ లో సెక్యూరిటీ లోపం మరోసారి బయటపడింది. ఓ నకిలీ ఉద్యోగి సచివాలయంలో హల్‌చల్ చేయడం సంచలనంగా మారింది. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావు చాలా రోజులుగా చలామణి అవుతున్నాడు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో వారు నిఘా పెట్టారు. ఈ మేరకు సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఇంటలిజెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది పూర్తి ఆధారాలు సేకరించి నకిలీ ఉద్యోగిని పట్టుకున్నారు.  రవిని అదుపులోకి తీసుకున్న సైఫాబాద్ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

సెక్షన్ ఆఫీసుల్లో పనులు చేయిస్తామని వసూళ్లు..

మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి. ప్రశాంత్ డ్రైవర్ రవి.. ఈ ఫేక్ ఐడీ కార్డులు తయారు చేసినట్లు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ గుర్తించారు. దీంతో సదరు డ్రైవర్ రవిని సైతం ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే.. ఈ ఫేక్ అధికారులు సెక్షన్ ఆఫీసుల్లో పనులు చేయిస్తామని సెక్రెటేరియట్ కు వచ్చే వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు