Revanth Vs KCR: కేసీఆర్ పాలనే బాగుంది.. సొంత 'X' ఖాతా పోల్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్!

తెలంగాణ కాంగ్రెస్ అధికారిక 'X' ఖాతాలో ఫామ్ హౌజ్ పాలన బాగుందా? ప్రజా పాలన బాగుందా? అని పోల్ పెట్టారు. 66 శాతం మంది ఫామ్ హౌజ్ పాలన బాగుందంటూ ఓటు వేశారు. ఈ ఓటింగ్ లో ఇప్పటి వరకు 58,343 మంది పాల్గొన్నారు. ఇది BRS బాట్ యూజర్ల పని అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

New Update
Telangana Congress Poll

Telangana Congress Poll

తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ (X) ఖాతాలో పెట్టిన పోల్ తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? అని పోల్ పెట్టారు. ఈ పోల్ కు రెండు ఆన్సర్ ల్లు ఇచ్చారు అందులో గత కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉద్ధేశిస్తూ A. ఫామ్ హౌస్ పాలన.. నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్ధేశిస్తూ B. ప్రజల వద్దకు పాలన అంటూ రెండు ఆప్షన్లు ఇచ్చారు. అయితే.. ఇప్పటి వరకు 58,343 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. 

ఇది బాట్ యూజర్ల పనే: కాంగ్రెస్

అయితే.. ఇందులో 66.1 శాతం మంది ఏ ఆప్షన్ పై క్లిక్ చేయగా.. 33.9 శాతం మంది కాంగ్రెస్ వైపు ఓటేశారు. ఇందుకు సంబంధించిన స్కీ్న్ షాట్స్ ను బీఆర్ఎస్ వైరల్ చేస్తోంది. ఇది ప్రభుత్వ పనితీరు అంటూ విమర్శలు చేస్తోంది. దొరల ఫాం హౌస్ బాట్ (BOT) యూజర్ల కారణంగానే తాము పెట్టిన పోల్ కు ఇలాంటి ఫలితం వచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

తాగుబోతు సంఘం పార్టీ వాళ్లకు మాత్రమే అలాంటి పాలన నచ్చుతుందంటూ ఫైర్ అవుతున్నారు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకునే తెలంగాణ ప్రజలు, ఈసారి సొంత బలంతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని చెబుతున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు