/rtv/media/media_files/2025/04/21/p4cHet8SWeGoI6e7j7cg.jpg)
Rahul Gandhi
తెలంగాణలో రోహిత్ వేముల చట్టానికి అడుగులు పడనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. దీనిపై ఎంపీ చామల కిరణ్ స్పందించారు. రాహుల్ గాంధీ ఏం ఆలోచించినా ప్రజల కోసమే ఆలోచిస్తారని అన్నారు. రోహిత్ చట్టంపై త్వరలో సీఎం రేవంత్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?
మరోవైపు రోహిత్ చట్టం తీసుకురావాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా రాహుల్ గాంధీ రెండ్రోజుల క్రితం లేఖ రాశారు. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. తమ రాష్ట్రంలో రోహిత్ చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. కులం, మతం ఆధారంగా ఏ విద్యార్థి కుడా వివిక్షకు గురికాకుండా చూసేందుకు ఈ చట్టాన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు.
Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!
Rohit Vemula Act In Telangana
తెలంగాణలోనూ రోహిత్ చట్టం?
— Telangana Awaaz (@telanganaawaaz) April 21, 2025
రోహిత్ చట్టం తేవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన రాహుల్ గాంధీ..
రోహిత్ చట్టంపై స్పందించిన ఎంపీ చామల కిరణ్..
రాహుల్ గాంధీ ఏం ఆలోచించినా ప్రజల కోసమే ఆలోచిస్తారు..
రోహిత్ చట్టం తేవాలని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు..
రోహిత్… pic.twitter.com/8mZFbAEKAc
Also Read : ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !
ఇదిలాఉండగా 2016 జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో రోహిత్ వేముల కుల వివక్ష వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాను ఎదుర్కొన్న వివక్ష గురించి ఆయన ఓ లేఖలో కూడా రాశారు. దీంతో యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ కూడా హెచ్‌సీయూకి వచ్చి విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. అయితే విద్యార్థులు వివక్షకు గురికాకుండా వాళ్లని కాపాడేందుకు రోహిత్ వేముల చట్టాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టాలని రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్‌కు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!
rtv-news | rohit-vemula | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu | latest telangana news | telangana news today | telangana news live updates | telangana-news-updates