Kaleshwaram Project: ఎన్డీఎస్‌ఏ నివేదిక బూటకం.. అది ఎన్డీఏ నాటకం.. కేటీఆర్‌ సంచలన ట్వీట్‌

మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  అదంతా ఎన్డీఏ ఆడుతున్న నాటకమని ఆయన ఆరోపించారు.

New Update
KTR

KTR

Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  అదంతా ఎన్డీఏ ఆడుతున్న నాటకమని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని రుజువైందని కేటీఆర్ ఆరోపించారు.

ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్

KTR Tweet On NDA

క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ఏ నివేదిక ఎలా ఇస్తుందని, ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదని కేటీఆర్‌ అన్నారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ప్రాథమిక నివేదిక, ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకూ రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు, పొంతనలేని అంశాలుండటం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టిందన్నారు. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనం అని కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

ప్రభుత్వం శాస్త్రీయ నివేదికలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. ఎన్డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ) నివేదికను ఎన్డీయే నివేదిక అనడంలో తప్పు లేదని ఎద్దేవా చేశారు.  దీనికి ఎల్ అండ్ టీ లేఖనే నిదర్శనమన్నారు.

‘‘శాస్త్రీయ వివరాలు లేకుండానే కాంగ్రెస్‌, బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుంది. కాళేశ్వరం తెలంగాణకు జీవధార.. కేసీఆర్‌ ఒక దార్శనికుడు’’ అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

Also Read : Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

Also Read :  BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే

 

ktr | kaleshwaram barrage | kaleshwaram case updates | kaleshwaram case | Kaleshwaram Commission | kaleshwaram-project | kcr | congress

Advertisment
Advertisment
తాజా కథనాలు