Telangana: కాళేశ్వరం విచారణ.. ఛలో BRK భవన్కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే..
కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్ కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు BRK భవన్కు దండులా తరలిరావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్ కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు BRK భవన్కు దండులా తరలిరావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. ఓపెన్ కోర్టులో ఈటలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కేవలం 20 నిమిషాల్లోనే ఈ విచారణ ముగిసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఆర్థికమంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.
తాను హరీశ్ రావుని కలిశాని వస్తున్న వార్తలను MP ఈటల రాజేందర్ ఖండించారు. చావులు, పెళ్లిళ్ల దగ్గర మాత్రమే హరీశ్ రావుని కలిశానని ఆయన అన్నారు. BJPయే తెలంగాణకు దిక్సూచి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన 3 తరాల ఉద్యమంలో అమరులను స్మరించుకున్నారు.
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదంతా ఎన్డీఏ ఆడుతున్న నాటకమని ఆయన ఆరోపించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో ఏర్పడిన సందిగ్ధతకు తెరదించి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రభత్వం భావిస్తోంది. దానికోసం కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ ఎ.బి.పాండ్య ఛైర్మన్గా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
BJP అంటేనే బూతు జనతా పార్టీ అని.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. BJPని ప్రశ్నిస్తే దేశ ద్రోహులా? అని ధ్వజమెత్తారు. తప్పు ఎవరు చేసినా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. కాళేశ్వరం వ్యవహారంలో KCR నిజాయితీ నిరూపించుకుంటే పూలదండలు వేస్తామన్నారు.
NDSA కాళేశ్వరంపై ఇచ్చిన నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారే డిజైన్ చేశారు.. వారే కట్టారు.. వారు అధికారంలో ఉండగానే కూలిందని ఆ పార్టీపై ఆయన మండిపడ్డారు. ప్రాజక్ట్ నిర్మించినవాళ్లు రైతులకు ద్రోహం చేశారన్నారు.