SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్

భారీ విజయంతో హైదరాబాద్ సీజన్ ను ముగించింది. కేకేఆర్ పై 110 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. హైదరాబాద్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కోలకత్తా చేతులెత్తేసింది. కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.

New Update
ipl

SRH VS KKR

హైదరాబాద్ మరోసారి విజృంభించేసింది. కాటేరమ్మ కొడుకు కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో హైదరాబాద్ భారీ లక్ష్యాన్ని చేసింది.  చివరి మ్యాచ్ లో 279 భారీ లక్ష్యాన్ని కోలకత్తాకు ఇచ్చింది. ఈ లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ ఆరంభాన్ని దూకుడుగానే చేసిన తరువాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో టార్గెట్ ఛేదించలేకపోయింది. కేకేఆర్  18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. మనీశ్‌ పాండే (37; 23 బంతుల్లో  2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్. హర్షిత్ రాణా (34*; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. ఓపెనర్ సునీల్ నరైన్ (31; 16 బంతులలో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా దాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. అజింక్య రహానె (15), అంగ్‌క్రిష్‌ రఘువంశీ (14), రమణ్‌దీప్ సింగ్ (13), క్వింటన్ డాకాక్ (9), రింకు సింగ్ (9) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కత్ (3/24), ఎషాన్ మలింగ (3/31), హర్ష్‌ దూబె (3/34) అదరగొట్టారు. 

విజృంభించిన కాటేరమ్మ కొడుకు..

మొదటి నుంచీ ఇలానే ఆడి ఉంటే హైదరాబాద్ ఆ జట్టుకు తిరుగులేకుండా పోయేది. అసలు ఇవే అంచనాలు హైదరాబాద్ జట్టు మీద ఉన్నాయి. చివరి మ్యాచ్ లలో ఎస్ఆర్హెచ్ మెరుపులు మెరిపిస్తోంది. ఐపీఎల్ లో ఈరోజు కోలకత్తా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 279 పరుగులు భారీ స్కోరును చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులలతో చితక్కొట్టగా.. ట్రావిస్ హెడ్  40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 పరుగులు, అభిషేక్ శర్మ  16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేశారు. చివర్లో ఇషాన్ కిషన్ కూడా 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 29 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2, వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టారు.కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2, వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టారు.

today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-kkr | match

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు