Operations Sindoor: గర్వపడుతున్నా.. ఆపరేషన్ సిందూర్ పై కేసీఆర్ ఎమోషనల్ పోస్ట్!
ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానన్నారు.
ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానన్నారు.
సంగారెడ్డి జిల్లా మల్కపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. సుభాష్ అనే వ్యక్తి భార్య మంజుల మీద ఉన్న కోపంతో ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. అనంతరం ఉరివేసుకుని చనిపోయాడు. వివాహేతర సంబంధం నపథ్యంలో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పెళ్లయిన మూడునెలలకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి భర్త , అత్తమామలు కారణమంటూ అమ్మాయి తరుపు బంధువులు దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలం అగ్రహారంలో చోటు చేసుకుంది. పోలీసులు, విలేకర్లపై కూడా దాడి జరిగింది.
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. సదాశివపేటలోని ఓ బీరువాల తయారీ ఫ్యాక్టరీలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఆ ఫ్యాక్టరీలో నిధి ఉందన్న సమాచారంతో ఒక వ్యక్తి తన ఆరేళ్ల కూతురిని బలివ్వబోయాడు. సమయానికి పోలీసులు వచ్చి దాన్ని ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది.
కామారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వివాహిత రేణుక ప్రియుడి కోసం భర్తను చంపేందుకు 15 లక్షల సుపారీ ఇచ్చింది. అదృష్టవశాత్తు భర్త కుమార్ గాయాలతో తప్పించుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విషయం తెలుసుకున్న పోలీసులు భార్యతో సహా ఇతర నిందితులను అరెస్టు చేశారు.
ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్య యాదవ్ కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నిన్నటి మీటింగ్ లో కేసీఆర్ కొత్తగా చెప్పిందేమీ లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆయన స్వరంలో భయం కనిపించిందన్నారు. తొలిసారి కేసీఆర్ పేపర్ చూసి ప్రసంగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హరీష్ రావు BRS పార్టీలో కరివేపాకు లాంటోడని సెటైర్లు వేశారు.
చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరీకి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమన్నారు. దీంతో లింగనిర్ధారణ పరీక్షలు చేయించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో పోరాడుతున్న మహిళకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు జగ్గారెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఆమని అనే మహిళ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది.